వందేభారత్ ట్రైన్‌లో వింత ఘటన.. గంటలకొద్ది వ్యక్తి టాయిలెట్‌లో..! కొంతమంది టిక్కెట్ తీసుకోకుండానే రైలులో ప్రయాణం చేస్తుంటారు. టీసీ వచ్చే సమయంలో టాయిలెట్‌లో దాక్కోవడమూ లాంటివి చేయడం మనం చూసే ఉంటాం. అయితే.. ఇలాంటి ఘటనలు సాధారణంగా సాధారణ రైళ్లలోనే జరుగుతుంటాయి. కానీ.. ఇక్కడ ఓ ప్రబుద్ధుడు మాత్రం టిక్కెట్ లేకుండా ఏకంగా ఏసీ రైలు ఎక్కేశాడు. అదీ వందే భారత్ రైలు. మరి టీసీ వస్తే ఏంటి పరిస్థితి..? అని అనుకుంటున్నారా..? ఏముంది.. సాధారణ రైల్లో దాక్కునట్టే మనోడు టాయిలెట్‌లోకి వెళ్లి దాక్కుతున్నాడు. ఈ వింత ఘటన కేరళలో జరిగింది. By Shareef Pasha 26 Jun 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి వందేభారత్ రైల్లో వింత ఘటన డోర్ లాక్ చేసి టాయిలెట్‌లో గంటలకొద్ది గడిపిన వ్యక్తి కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో ఘటన టాయిలెట్ డోరు విరగొట్టి వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు వ్యక్తి వివరాలను ఆరా తీస్తున్న రైల్వే అధికారులు కేరళలోని ఉత్తర కాసర్‌గోడ్ జిల్లాలో వందే భారత్ రైలు ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోంది. అందులో ఓ ప్రయాణికుడు టిక్కెట్ తీసుకోలేదు. ఇంతలో టీసీ వస్తున్నాడని గమనించిన ఆ వ్యక్తి.. వెంటనే టాయిలెట్‌లోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. టీసీకి భయపడి గంటల తరబడి అందులోనే ఉండిపోయాడు. ఎంత పిలిచినా బయటకు వచ్చేందుకు ససేమిరా అన్నాడు. ఇలా దాదాపు 275 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇక వందేభారత్ రైలు శోర్‌నూర్ స్టేషన్‌కు చేరింది. ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో ఆర్పీఎఫ్ అధికారులు వచ్చి.. టాయిలెట్ డోరు విరగొట్టారు. అందులో దాక్కున్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు. అతడు ఎర్రరంగు టీషర్టు వేసుకుని ఉన్నాడు. హిందీలో మాట్లాడుతున్నాడు. బిక్కుబిక్కుమంటూ పిచ్చి చూపులు చూస్తున్నాడు. తనను కొంతమంది తరుముకొంటూ వచ్చారని, వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వందే భారత్ టైన్ ఎక్కి.. బాత్‌రూంలోకి దాక్కున్నట్లు చెప్పాడు. అయితే.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఆర్పీఎఫ్.. అతడి వివరాలు, స్వస్థలం గురించి ఆరా తీస్తున్నారు. టిక్కెట్ లేకుండా వందేభారత్ ఎక్కినందుకు ఫైన్ కూడా వేశారు. ఇక.. ఆ వ్యక్తి చెబుతున్నట్లు నిజంగానే ఎవరైనా తరుముకొచ్చారా.. లేక తప్పించుకునేందుకు కట్టు కథలు చెబుతున్నాడా అన్న దానిపై ఆర్పీఎఫ్ అధికారులు విచారణ చేస్తున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి