కేరళ హిల్స్ అండ్ వాటర్స్ ట్రిప్! ప్యాకేజీ వివరాలివే.. సమ్మర్‌లో కేరళ టూర్ వేద్దామనుకుంటున్నారా? అయితే ఐఆర్‌సీటీసీ ఆఫర్ చేస్తున్న ‘కేరళ హిల్స్ అండ్ వాటర్స్’ టూర్ ప్యాకేజీపై ఓ లుక్కేయండి! By Durga Rao 24 Apr 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి సమ్మర్‌లో కేరళ వెళ్లాలనుకునేవారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్.. ‘కేరళ హిల్స్ అండ్ వాటర్స్’ పేరుతో ఓ టూర్‌ను ఆపరేట్ చేస్తోంది. సమ్మర్‌లో కేరళ టూర్ వేద్దామనుకుంటున్నారా? అయితే ఐఆర్‌సీటీసీ ఆఫర్ చేస్తున్న ‘కేరళ హిల్స్ అండ్ వాటర్స్’ టూర్ ప్యాకేజీపై ఓ లుక్కేయండి! ఈ ట్రిప్‌లో భాగంగా కేరళలోని హిల్ స్టేషన్స్‌తో పాటు బ్యాక్ వాటర్స్‌ను కూడా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. టూర్ వివరాల్లోకి వెళ్తే.. సమ్మర్‌లో కేరళ వెళ్లాలనుకునేవారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్.. ‘కేరళ హిల్స్ అండ్ వాటర్స్’ పేరుతో ఓ టూర్‌ను ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్ల పాటు సాగుతుంది. సికింద్రాబాద్, గుంటూరు, నల్గొండ, తెనాలి రైల్వేస్టేషన్ల నుంచి ప్రయాణీకులు జాయిన్ అవ్వొచ్చు. ఈ టూర్ ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఒకేరోజు 4,71,751 మంది విమాన ప్రయాణం టూర్ ఇలా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం 12:20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కడంతో ఐఆర్‌సీటీసీ కేరళ టూర్ మొదలవుతుంది. మొదటిరోజంతా రైలు ప్రయాణం చేసి రెండో రోజు మధ్యాహ్నం 12:55 గంటలకు ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ్నుంచి రోడ్డు మార్గంలో మున్నార్‌కు చేరుకుంటారు. మున్నార్ టీ తోటల అందాలను వీక్షిస్తూ అక్కడ బుక్ చేసిన హోటల్‌కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే స్టే చేస్తారు. తెలంగాణ టూరిజం పౌర్ణమి యాత్ర మూడో రోజు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేసి మున్నార్‌లోని ఎరవికులం నేషనల్ పార్క్, టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ వంటివి కవర్ చేసుకుని రాత్రికి మళ్లీ హోటల్‌లో స్టే చేస్తారు. నాలుగో రోజు ఉదయం రోడ్డు మార్గం ద్వారా అలపుజా చేరుకుంటారు. అక్కడ అలెప్పీ బ్యాక్ వాటర్స్, బోట్ రైడ్ వంటివి చూసుకుని రాత్రికి హోటల్‌లో స్టే చేస్తారు. ఇక ఐదో రోజు అలపుజా నుంచి ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌కు చేరుకుని మధ్యాహ్నం 11:20 గంటలకు రిటర్న్ ట్రైన్ ఎక్కడంతో టూర్ ముగుస్తుంది. ప్యాకేజీ ధరలు.. ఐఆర్‌సీటీసీ కేరళ హిల్స్ అండ్ వాటర్స్ టూర్ ప్యాకేజీ ధరలు.. థర్డ్ ఏసీ(కంఫర్ట్) అయితే సింగిల్ షేరింగ్‌కు రూ.35,570, ట్విన్ షేరింగ్‌కు రూ.20,430, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.16,570గా ఉన్నాయి. స్లీపర్ క్లాస్(స్టాండర్డ్)లో సింగిల్ షేరింగ్‌కు రూ.32,860, ట్విన్ షేరింగ్‌కు రూ.17,720, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,860గా ఉన్నాయి. ప్యాకేజీలో భాగంగా రైలు ప్రయాణం, వాహనంలో సైట్ సీయింగ్, హోటల్ స్టే, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. లంచ్, డిన్నర్, బోటింగ్, ఎంట్రీ టికెట్స్ వంటివి ప్రయాణీకులే చూసుకోవాలి. టూర్ బుక్ చేసుకోవాలనుకునేవారు ఐఆర్‌సీటీసీ అఫీషియల్ పోర్టల్(irctctourism.com)లో లాగిన్ అవ్వొచ్చు. #tours #trips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి