Helicopter Crash: కూలిన హెలికాప్టర్‌...మిలిటరీ చీఫ్‌ దుర్మరణం!

హెలికాఫ్టర్‌ కూలిన ఘటనలో కెన్యా దేశ మిలటరీ చీఫ్‌ జనరల్ ఫ్రాన్సిస్ ఒగొల్లా దుర్మరణం పాలయ్యారు. ఈ హెలికాఫ్టర్ లో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మరణించారు.కెన్యాలోని మిలిటరీ దళాల తనిఖీల కోసం మిలిటరీ చీఫ్ వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

New Update
Helicopter Crash: కూలిన హెలికాప్టర్‌...మిలిటరీ చీఫ్‌ దుర్మరణం!

హెలికాఫ్టర్‌ కూలిన ఘటనలో కెన్యా దేశ మిలటరీ చీఫ్‌ జనరల్ ఫ్రాన్సిస్ ఒగొల్లా దుర్మరణం పాలయ్యారు. ఈ హెలికాఫ్టర్ లో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మరణించారు. గురువారం మధ్యాహ్నం 2.20 గంటలకు రాజధాని నైరోబికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్గెయో మారాక్వెట్ కౌంటీలో హెలికాఫ్టర్‌ పేలిపోయింది.

వాయువ్య కెన్యాలోని మిలిటరీ దళాల తనిఖీల కోసం మిలిటరీ చీఫ్ వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయితే, ప్రమాదానికి గల కారణమేంటో ఇంకా తెలియరాలేదు. మిలటరీ చీఫ్ మరణంపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో విచారం వ్యక్తం చేశారు. కెన్యా ఓ ధైర్యవంతుడైన సైనిక జనరల్‌ను కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలతో బయటపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని వివరించారు.

హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఎయిర్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను కూడా ఘటనా స్థలానికి పంపించినట్లు తెలిపారు. ఒగొల్లా గతంలో కెన్యా ఎయిర్‌ఫొర్స్ అధిపతిగా ఉన్నారు. ఆ తరువాత డిప్యూటి మిలిటరీ చీఫ్‌గా పదోన్నతి పొందారు. గతేడాది అధ్యక్షుడు రూటో ఆయనను మిలిటరీ చీఫ్‌ గా నియమించారు.

1984లో కెన్యా మిలిటరీలో చేరిన ఒగొల్లా అమెరికాలో ఫైటర్‌ పైలట్‌గా శిక్షణ తీసుకున్నారు. కొంతకాలం పాటు ఎయిర్‌ఫోర్సుకు ఇన్‌స్ట్రక్టర్ పైలట్‌గా కూడా ఉన్నారు.

Also read: ఇరాన్‌ పై బాంబులు కురిపించిన ఇజ్రాయెల్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు