Kejriwal : కేజ్రీవాల్ కు షాక్.. ఆప్ నకు మంత్రి రాజీనామా! కేజ్రీవాల్ మంత్రి వర్గంలోని మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అంతేకాకుండా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఏర్పాటైన పార్టీ, ఇప్పుడు పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని విమర్శించారు. By Bhavana 11 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Delhi CM Aravind Kejriwal : దేశంలో సార్వత్రిక ఎన్నికలు(General Elections) సమీపిస్తున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) కి భారీ షాక్ తగిలింది. కేజ్రీవాల్ మంత్రి వర్గంలోని మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్(Raj Kumar Anand) తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అంతేకాకుండా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకనాడు అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ, ఇప్పుడు పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని రాజ్‌కుమార్ ఆనంద్ విమర్శించారు. ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగడం తనకు సముచితంగా అనిపించడం లేదని ఆయన తెలిపారు. అవినీతిపరులతో తన పేరు ఉండకూడదని అనుకుంటున్నట్లు తెలిపారు. . ‘‘రాజకీయాలు మారితే దేశం మారిపోతుందని గతంలో కేజ్రీవాల్(Aravind Kejriwal) జంతర్ మంతర్ నుంచి పిలుపునిచ్చారు. రాజకీయాలు మారలేదు. కానీ రాజకీయ నాయకుడు మారాడు’’ అంటూ రాజ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజలకు సేవ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాను. అయితే ఆ పార్టీనే ఇప్పుడు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా సమర్పించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజీనామా(Resign) నిర్ణయాన్ని రాజ్ కుమార్ స్వతహాగా తీసుకున్నారా ? లేక ఎవరైనా అలా చేయించారా అనే దాని మీద చర్చలు మొదలయ్యాయి. Also read: ఒంగోలులో రణరంగంగా మారిన ప్రచారం! #aravind-kejriwal #resign #aap #raj-kumar-anand మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి