Nagam Janardhan Reddy: కేసీఆర్ ప్రాజెక్ట్‌ల పేరుతో దోపిడీ చేస్తున్నాడు కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కేసీఆర్‌కు అవగాహన లేదన్నారు. ఒక్క ప్రాజెక్టు కోసం రెండు మూడు సార్లు టెండర్లను ఎందుకు పిలుస్తారని ప్రశ్నించారు. By Karthik 17 Aug 2023 in రాజకీయాలు మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి కేసీఆర్‌కు ప్రాజెక్టుల నిర్మాణంపై అవగాహన లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై స్పందించిన ఆయన.. తాను ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు ఆపాలని కేసులు పెట్టేలదని, కాంట్రాక్టర్ 830 కోట్ల రూపాయలతో పంపు మోటర్లను కొనుగోలు చేస్తే.. ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్‌కు 2 ,436 కోట్లు ఇచ్చిందన్నారు. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ కాంట్రాక్టర్‌కు 1630 కోట్లు అధికంగా చెల్లించారన్నారు. ప్రాజెక్ట్ పనులు ఆపాలని తాను కోర్టుకు వెళ్లలేదన్న ఆయన.. కాంట్రాక్టర్‌కు అంత మొత్తం డబ్బు ఎందుకు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలని కోర్టుకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. తాను కేసీఆర్‌ను ప్రశ్నించినందుకు కొందరు బీఆర్‌ఎస్ నేతలు తనపై దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై చర్చ కోసం ఎక్కడికైనా రావడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. 2016 జనవరి 1న కేసీఆర్ టెండర్లను పిలిచారన్న ఆయన.. 30 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి ఇంతవరకు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ప్రస్తుతం 3 రేట్లు అధిక కాలం గడిచిపోయిందన్న ఆయన.. కేసీఆర్ మాత్రం ఏదో గనకార్యం చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు ఏ విధంగా చేయ్యాలి, కాలువల మ్యాప్‌లకు సంబంధించిన ప్రణాళిక రూపొందించి.. దీనికోసం మళ్లీ టెండర్లను పిలిచారన్నారు. దీని కోసం 200 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని ఆయన గుర్తు చేశారు. కానీ నార్లాపూర్, ఏదులా, వట్టెము, ఉద్దండాపూర్, కర్వెలా వరకు సాగునీరు వచ్చేలా ప్లాన్ చేశారన్నారు. దీని ఖర్చు గతంలోనే 35 వేల కోట్లుగా అంచనా వేసుకోగా.. దీని ఖర్చు ప్రస్తుతం 50 వేల కోట్లు దాటి పోయిందన్నారు. ఏ ప్రాజెక్ట్ ప్రారంభించినా ముందు దాని సంబంధించి పనుల గురించి లోతుగా అధ్వాయం చేసిన ఆ ప్రాజెక్ట్‌కు సంబంధిచిన కాలువలు ఎక్కడి నుంచి ప్రాజెక్ట్‌కు వస్తాయి.? ప్రాజెక్ట్ నుంచి ఎంతదూరం వెళ్తాయి? అనే వాటిగురించి విశ్లేషించి ఒకేసారి టెండర్లను పిలవాలి కానీ.. ఇలా ఒక్క ప్రాజెక్టు కోసం రెండు మూడు సార్లు టెండర్లను పిలవడం ఏంటన్నారు. కేసీఆర్ టెండర్ల పేరుతో తన బినామీలకు ముడుపులు అప్పగిస్తున్నారని నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. #kcr #nagam-janardhan-reddy #contractor #rangareddy-elevation-project మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి