రష్మికే కాదు..కత్రినా కైఫ్ కూడా డీప్ ఫేక్ బాధితురాలే.!

రష్మికే కాదు..బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కూడా డీప్ ఫేక్ బాధితురాలే. తాజాగా, కత్రినా డీప్ ఫేక్ ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. టైగర్-3 మూవీ ఫైట్‌సీన్‌లో కత్రినా టవల్‌ కట్టుకుని ఫైట్‌ చేయగా వాటిని మార్ఫింగ్‌ చేశారు. డీప్‌ఫేక్‌ ఫొటోల్లో కత్రినా లోదుస్తుల్లో ఫైట్‌ చేస్తున్నట్లు చూపించారు.

New Update
రష్మికే కాదు..కత్రినా కైఫ్ కూడా డీప్ ఫేక్ బాధితురాలే.!

Katrina Kaif Deepfake Photo: డీప్‌ఫేక్ అంటే.. అమ్మాయిలు అమ్మో అంటూ భయపడుతున్నారు. టెక్నాలజీని కొందరూ మిస్‌ యూజ్‌ చేసుకుని అమ్మాయిల ఫొటోలను, వీడియోలను ఇష్టం వచ్చినట్లు ఎడిట్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ల ను ఎక్కువుగా టార్గెట్ చేస్తున్నారు. రిసెంట్ గా నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు సంబంధించిన మార్ఫింగ్‌ వీడియో నెట్టింట్లో ఎంత వైరల్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జారా పటేల్ (Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి ఏఐ (AI) సాంకేతికతతో రష్మిక ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారి కలకలం సృష్టించింది.

Also Read: అతని మరణం నాకు తీరని లోటు..యాంకర్‌ ఝాన్సీ ఎమోషనల్‌ పోస్ట్‌!


ఈ ఘటనతో అందరూ  ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సిని యాక్టర్స్ దగ్గర నుండి రాజకీయ ప్రముఖుల వరకూ అందరూ దీనిని ఖండించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, రష్మికే కాదు.. ప్రముఖ బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ (Katrina Kaif) కూడా డీప్‌ఫేక్‌ బాధితురాలే. కత్రినాకు సంబంధించిన కొన్ని డీప్‌ఫేక్‌ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

బాలీవుడ్ బ్యూటీ  కత్రినా కైఫ్ ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్ (Salman Khan)తో కలిసి టైగర్‌ 3 (Tiger 3)  చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె చేసిన టవల్ ఫైట్ సీన్ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఓ హాలీవుడ్‌ స్టంట్‌ ఉమన్‌తో కలిసి కత్రినా పోరాట దృశ్యాలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, కొందరు ఆ దృశ్యాలను మిస్‌యూజ్‌ చేశారు. ఒరిజినల్‌ ఫైట్‌సీన్‌లో కత్రినా టవల్‌ కట్టుకుని ఫైట్‌ చేయగా .. ఏఐ సాంకేతికతో వాటిని మార్ఫింగ్‌ చేశారు. డీప్‌ఫేక్‌ ఫొటోల్లో కత్రినా లోదుస్తుల్లో ఫైట్‌ చేస్తున్నట్లు చూపించారు. దీంతో ఈ అంశం కాస్తా బాలీవుడ్‌ ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. అధికారులు ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, కొత్త చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో టెక్నాలజీ బాగా డెవలప్ అయిందని సంతోష పడాలో లేదంటే ఇలాంటి వాటికి మిస్ యూజ్ చేస్తున్నందుకు బాధపడాలో తెలియడం లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు