పుల్లలపాడులో దారుణం.. దస్తావేజు లేఖరిపై కాల్పులు భూ సెటిల్‌మెంట్ పేరుతో ఇంట్లోకి వచ్చి దస్తావేజు లేఖరిని కాల్చి చంపిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పుల్లలపాడుకు చెందిన కాట్రగడ్డ ప్రభాకర్‌ను మంగళవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు తుపాకితో కాల్చి పరారయ్యారు. ప్రభాకర్ అక్కడికక్కడే మరణించినట్లు భార్య పోలీసులకు తెలిపింది. By srinivas 29 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భార్య ముందే భర్తను హతమార్చిన సంఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద భూ సెటిల్‌మెంట్‌లు, రిజిస్ట్రేషన్లు చేయిస్తూ జీవనం కొనసాగిస్తున్న 60 ఏళ్ల వృద్ధుడిని మాటల్లోకి దించి.. సెటిల్ మెంట్ పేరుతో నమ్మించి గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. తన కళ్లముందే విగతజీవుడైన భర్తను చూసి భార్య గుండేలవిసేలా ఏడ్చింది. Also read :భర్త పర్సనల్ విషయాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు.. కర్ణాటక హైకోర్టు ఈ మేరకు పోలీసులు, మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని పుల్లలపాడులో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కాట్రగడ్డ ప్రభాకర్(60) సమీపంలోని అనంతపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద భూ సెటిల్‌మెంట్‌లు చేస్తూ రిజిస్ట్రేషన్లు చేయిస్తుంటారు. ఈ క్రమంలో పలువురు ఆయన ఇంటికి వెళ్తుంటారు. అదే మాదిరిగా మంగళవారం సాయంత్రం 6:30 ప్రాంతంలో కారులో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ప్రభాకర్ ఇంటికి వచ్చారు. వాళ్లు ఆయనతో రూ.12 లక్షల విషయం ఏం చేశారని మాట్లాడుతూ నమ్మించారు. దీంతో భూమికి సంబంధించిన విషయమై ఉంటుందని అక్కడే ఉన్న భార్య సావిత్రి లోపలకు వెళ్లిపోయారు. ఇంతలో రెండు నిమిషాలకే తుపాకీ పేలిన శబ్దం రావడంతో ఆమె భయంగా బయటకు పరిగెత్తుకొచ్చారు. కానీ అప్పటికే ప్రభాకర్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే దుండగులు ఇద్దరూ కాల్పులు జరిపిన వెంటనే అక్కడినుంచి కారులో పరారైనట్లు ఆమె తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్పీ జగదీష్, కొవ్వూరు డీఎస్పీ వర్మ, సీఐ నున్న రాజు, ఎస్సైలు ఘటనా స్థలాన్ని, సమీపంలోని సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మృతుడు ఎక్కువగా భూమి సెటిల్‌మెంట్లు చేస్తుంటారని, ఆ కోణంలోనే హత్య జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. త్వరలోనే నిందుతులను పట్టుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. #shot-dead #katragadda-prabhakar #the-thugs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి