Telangana: మంత్రి కేటీఆర్‌కు రూ. లక్ష చెక్కు అందజేసిన శంకరమ్మ..

ఎన్నికల ప్రచారం ఖర్చుల కోసం రూ. లక్ష చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందజేశారు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ నిలవాలని అన్నారు. శంకరమ్మను ఉన్నత స్థానంలో చూస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

New Update
Telangana: మంత్రి కేటీఆర్‌కు రూ. లక్ష చెక్కు అందజేసిన శంకరమ్మ..

Kasoju Shankaramma: తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ ఆచారి తల్లి శంకరమ్మ లక్ష రూపాయల చెక్కును భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు(KTR)కి అందించారు. శనివారం నాడు హైదరాబాద్‌(Hyderabad)లో మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి.. కేటీఆర్‌ను కలిశారామె. భారత రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచార ఖర్చులకోసం తన వంతుగా రూ. లక్ష చెక్కును పార్టీకి అందించారు శంకరమ్మ. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత శంకరమ్మను మరింత గౌరవప్రదమైన స్థానంలో నిలిపే బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని తెలియజేశారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరుల ఆశయాల సాధన కోసం మరోసారి బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ దిశగా కృషి చేయాలని శంకరమ్మకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. కాగా, ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ గెలిచి హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్ నిలవాలని ఆకాంక్షించారు శంకరమ్మ.

తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఏమైందో ఏమోగానీ.. తరువాత ఆ ఊసే లేకుండా పోయింది. ఇక గతంలో హుజూర్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన శంకరమ్మ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత అదే స్థానానికి ఉప ఎన్నిక జరుగగా.. టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే, ఆమెకు ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చిన కేసీఆర్.. హుజూర్ నగర్ టికెట్‌ను సైదిరెడ్డికి ఇచ్చారు. ఆ ఎన్నికల్లో సైదిరెడ్డి ఘన విజయం సాధించారు.

Also Read:

ప్రధాన పార్టీలకు రెబల్స్ గండం.. బుజ్జగింపులు షురూ చేసిన అగ్రనేతలు..

ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? పార్టీల వారీగా వివరాలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు