Karthika deepam: వంటలక్క మళ్ళీ వచ్చేసిందోచ్.. రేపటి నుంచే ప్రారంభం.. వైరలవుతున్న సాంగ్ ప్రోమో..! బుల్లితెర పై సంచలనం సృష్టించిన సీరియల్ కార్తీక దీపం. కొంత కాలం కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ సీరియల్.. 'కార్తీక దీపం' నవ వసంతం పేరుతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. తాజాగా కార్తీక దీపం 2 కు సంబంధించిన సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. By Archana 24 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Karthika deepam: బుల్లితెర పై అతి తక్కువ సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వాటిలో ఒకటి కార్తీక దీపం. ఏదైనా సీరియల్ ఏడాది, రెండేళ్లు కొనసాగడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా ఆరేళ్ల పాటు నెంబర్ 1 టీఆర్పీ తో సంచలనం సృష్టించింది 'కార్తీక దీపం' సీరియల్. డాక్టార్ బాబు, వంటలక్క పాత్రలతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈ సీరియల్ కు 2023లో శుభం కార్డు పడింది. Also Read: Actress Anjali: విడాకులు తీసుకున్న నిర్మాతతో.. హీరోయిన్ అంజలి పెళ్లి? అయితే సంవత్సరం పాటు కాస్త గ్యాప్ తీసుకున్న 'కార్తీక దీపం' మళ్లీ కొత్త రంగులతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 'కార్తీక దీపం నవ వసంతం' అనే పేరుతో మొదలు కాబోతుంది. 25 సోమవారం నుంచి రాత్రి 8:00 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు సీరియల్ యూనిట్. బుల్లితెర చరిత్రలో ఎప్పుడు లేనట్లుగా ఈ సీరియల్ కు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా.. తాజాగా సీరియల్ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేశారు. "ఆరనీకు మా ఈ దీపం.. కార్తీక దీపం" అంటూ పాత పాటనే కొత్త పాత్రలతో రీమేక్ చేశారు. సీరియల్‌లో ఎవరెవరు నటించబోతున్నారు? వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై క్లారిటీ ఇస్తూ ఈ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. సీజన్ 1కు దర్శకత్వం వహించిన కాపుగంటి రాజేంద్రే.. సీజన్ 2 కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వంటలక్క , డాక్టర్ బాబు బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. Also Read: Ketika Sharma: బీచ్ అందాలతో పోటీపడుతున్న హాట్ బ్యూటీ కేతిక.. వైరలవుతున్న ఫొటోలు..! #karthika-deepam-serial #karthika-deepam-season-2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి