Karnataka:హిజాబ్ గొడవలను మళ్ళీ తెర మీదకు తీసుకువస్తున్న కర్ణాటక ఎగ్జామినేషన్‌ అథారిటీ

ముస్లిమ్ అమ్మాయిలు హిజాబ్ ధరించడం మీద కర్ణాటకలో ఎంత పెద్ద గొడవ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఆ గొడవను తెర మీదకు తీసుకువస్తోంది కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ. నియామక పరీక్షలకు హాజరయ్యేవారు తలను పూర్తిగా కప్పేలా దుస్తులు ధరించకూడదని నిషేధం విధించింది.

New Update
TS EdCET: టీఎస్ ఎడ్ సెట్ 2024 షెడ్యూల్ విడుదల..రాతపరీక్షతేదీ ఇదే..!!

కర్ణాటకలో నవంబరు 18, 19 తేదీల్లో పలు బోర్డులు, కార్పొరేషన్ల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఈనియామక పరీక్షలకు కొన్ని రూల్స్ ను పెట్టింది కర్ణాటక ఎగ్జామినేషన్‌ అథారిటీ. ఇందులో డ్రెస్ కోడ్ కూడా ఉంది. తలను పూర్తిగా కప్పేలా టోపీలు లేదా బట్టలు ధరించ కూడదని కండిషన్ పెట్టింది. అలా వచ్చిన వారిని పరీక్షకు అనుమతించమని స్పష్టం చేసింది. పరీక్షల్లో మోసాలు, కాపీయింగ్‌ను నివారించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది.

Also read:వైరల్ అవుతున్న నీహారిక లవ్ లెటర్

పరీక్షలు రాసేటప్పుడు తల, ముఖం, చెవులు, నోటిని కప్పేలా ఏమీ ఉండకూడదని కేఈఏ రూల్ పెట్టింది. దీంతో పాటూ ఆభరణాలను కూడా నిషేధించింది. అయితే అందులో పెళ్ళయిన మహిళలకు మినహింపు ఇస్తూ మంగళసూత్రాలు, మెట్టెలు ధరించ వచ్చని చెప్పింది. ఇప్పుడు ఈ ప్రకటన పెద్ద చర్చకే తెరలేపింది. గతంలో కూడా కేఈఏ ఇలాగే నిబంధనలు పెడితే కొన్ని మతాలు, సంఘాల వారి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అలాగే కాలేజీలకు హిజాబ్ ధరించి రాకూడదని రూల్ పెట్టినప్పుడు కూడా చాలా గొడవ అయింది. ముస్లిం అమ్మాయిలు పెద్ద ఆందోళన చేశారు. ఇవన్నీ తెలిసి కూడా ఇప్పుడు ఇలాంటి రూల్ పెట్టడం ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. తాజా నిబంధనల్లో హిజాబ్‌
గురించి డైరెక్ట్ గా చెప్పకపోయినస్పటికీ.. తలను కప్పి ఉంచే దుస్తులపై నిషేధం ఉండటంతో దీన్ని ధరించేందుకు కూడా అనుమతి ఉండబోదని తెలుస్తోంది. అయితే అక్టోబరులో జరిగిన కొన్ని నియామక పరీక్షల్లో హిజాబ్‌ను అధికారులు అనుమతించారు. అప్పటికి ఈ నిబంధనలు ఉన్నాయో లేదో తెలియాల్సి ఉంది.

Also read:బీపీ, కోపం వేరువేరు బాసూ… ముందు ఈ తేడాలు తెలుసుకో..!

Advertisment
Advertisment
తాజా కథనాలు