వెనక్కి తగ్గిన కాపు నేత..లేఖను ఉపసంహరించుకున్న జోగయ్య

ఏపీ సీఎం జగన్‌కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఘాటైన పదజాలంతో జగన్‌కు ఆయన చురకలంటించారు. మీపై అనేక కేసుల్లో విచారణ జరుగుతోంది... ఒకవేళ మీరు దోషిగా తేలితే అయితే మీ తర్వాత సీఎం ఎవరు? అంటూ తన లేఖలో ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఆ లేఖలపై స్పందిస్తూ మరో లేఖ విడుదల చేశారు మాజీ మంత్రి హరిరామజోగయ్య.

New Update
వెనక్కి తగ్గిన కాపు నేత..లేఖను ఉపసంహరించుకున్న జోగయ్య

Kapu leader who did not back down..Jogaiah withdrew the letter

లేఖపై జోగయ్య స్పందన

వ్యక్తిగత విమర్శలతో ఈమధ్య వివాదాస్పదం అవుతున్న జనసేన, వైసీపీ నేతలు. పశ్చిమగోదావరి ఇటివలే సీఎం జగన్‌ను విమర్శిస్తూ జనసేన నేత, కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖలు రాజకీయ వర్గాల్లో పలు విమర్శలకు దారి తీశాయి. అసలు జగన్ రాజశేఖరరెడ్డికే పుట్టారా అంటూ లేఖలో విమర్శించారు జోగయ్య. అయితే ఇప్పుడు తాను రాసిన లేఖపై జోగయ్య స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్న అంటూ మరో లేఖను జోగయ్య విడుదల చేశారు.

సీఎం ఎవరు? అని లేఖ

ఈ మధ్య సీఎం జగన్‌కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య సంచలన లేఖ రాశారు. జగన్‌పై చాలా కేసులున్నాయని, జగన్ దోషిగా తేలితే తర్వాత సీఎం ఎవరు? అని హరిరామజోగయ్య రాసిన లేఖ ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపుతోంది. సీబీఐ, ఈడీ సంస్థలు క్విడ్ ప్రోకో, మనీలాండరింగ్ అభియోగాలను సీఎంపై మోపాయని, వాటి నేపథ్యంలో జగన్ 16 నెలలు జైలులో కూడా ఉన్నారని గుర్తు చేశారు.

జగన్‌ను కోర్టు దోషిగా ప్రకటిస్తే

అయితే బెయిల్‌పై బయటికి వచ్చిన జగన్‌ను కోర్టు దోషిగా ప్రకటిస్తే ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే తర్వాత సీఎం పదవిని రెడ్లు చేపడతారా లేక కాపులు చేపడతారా అని ప్రశ్నించారు. బడుగు బలహీనవర్గాల వైపు జగన్ మొగ్గితే గర్వపడతామని అన్నారు. అలాంటి పరిస్థితి వస్తే బడుగు బలహీన వర్గాల వారిని సీఎం చేస్తామని జగన్ బహిరంగ ప్రకటన చేస్తే బాగుంటుందన్నారు. ఏది ఏమైనా జగన్ కేసుల గురించి, తర్వాతి సీఎం ఎవరు అన్నదాని గురించి రాసిన ఈ లేఖ ఇపుడు వైరల్ అయింది. బీజేపీతో జగన్‌కు చెడిందని, ఈ క్రమంలోనే జగన్ త్వరలోనే జైలుకు వెళ్లే అవకాశముందని ప్రచారం జరగుతున్న నేపథ్యంలో జగన్‌కు హరిరామజోగయ్య రాసిన లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు