KCR: కేసీఆర్ పోటీ పై సంచలన నిర్ణయం తీసుకున్న కామారెడ్డి 9 గ్రామపంచాయతీలు.. గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానాలు! కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డికి చెందిన 9 పంచాయతీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. మాచారెడ్డి మండలంలోని ఉమ్మడి ఎల్లంపేట పరిధిలోని ఈ తొమ్మిది పంచాయతీలు కేసీఆర్ ను గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. By P. Sonika Chandra 26 Aug 2023 in రాజకీయాలు నిజామాబాద్ New Update షేర్ చేయండి KCR: రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డికి చెందిన 9 పంచాయతీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. మాచారెడ్డి మండలంలోని ఉమ్మడి ఎల్లంపేట పరిధిలోని ఈ తొమ్మిది పంచాయతీలు కేసీఆర్ ను గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. ఈ మేరకు ఆ తీర్మానాలను మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగారావుకు శనివారం ఉదయం అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఆధ్వర్యంలో ఎల్లంపేట మెయిన్ రోడ్ లో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇక ఎంపీపీ ర్యాలీలో మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం ఏవిధంగా అయితే ఏకగ్రీవ తీర్మానాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో.. అదే విధంగా కేసీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని.. కామారెడ్డి నియోజకవర్గం ప్రజల ఉద్యమ స్పూర్తిని చాటుదామన్నారు. ఇక ఈ తొమ్మిది గ్రామాల ప్రజల ఓట్లు కేవలం కారు గుర్తుకే వేస్తామని.. తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు 9 తొమ్మిది గ్రామాల సర్పంచులు డిక్లేర్ చేశారు. ఈ పంచాయతీల బాటలోనే మరిన్ని..! ఇక కామారెడ్డి నుంచి కేసీఆర్ కు భారీగా పట్టం కట్టడానికి ఎల్లంపేట గ్రామాల బాటలోనే మాచారెడ్డి మాండలంలోని మరికొన్ని గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. భారీ మెజార్టీతో కేసీఆర్ ను గెలిపించుకోవాలని కామారెడ్డిలోని బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాయి. Also Read: సాయంత్రం చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఖర్గే స్పీచ్ పై ఉత్కంఠ!! #brs #kcr #kamareddy #telangana-assembly-elections-2023 #kcr-kamareddy #kamareddy-public-supports-cm-kcr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి