మహిళా బస్ డ్రైవర్‌కు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన కమల్‌హాసన్ కోయంబత్తూరులో మొదటి మహిళా బస్ డ్రైవర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నటువంటి షర్మిల ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. అయితే ఈమె తన బస్ డ్రైవర్ ఉద్యోగాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం కాస్త నటుడు కమల్ హాసన్ దృష్టికి వెళ్లడంతో స్వయంగా షర్మిలను తన ఆఫీసుకు పిలిపించి ఆమెకు కొత్త కారును బహుమానంగా ఇచ్చారు. By Shareef Pasha 28 Jun 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి షర్మిల ఒక ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించిన బస్సుకు డ్రైవర్ గా పనిచేస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న డీఎంకే ఎంపీ కనిమొళి తాను కోవైలో పర్యటించినప్పుడు షర్మిలా డ్రైవ్ చేస్తున్న బస్సులో ప్రయాణించారు. ఆ సమయంలో కండక్టర్ ఎంపీకి టికెట్ ఇచ్చారు. ఇలా తన బస్సులో ప్రయాణం చేసిన ఎంపీకి కండక్టర్ టికెట్ ఇవ్వడం పట్ల షర్మిల తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీకి టికెట్ ఇవ్వడం ఏంటి అంటూ మండిపడ్డారు. దీంతో ఈ విషయం యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో కండక్టర్ సైతం షర్మిలపై కంప్లైంట్ ఇచ్చారు. ఇలా పాపులారిటీ కోసం సెలబ్రిటీలను తన బస్సులో ఫ్రీగా తిప్పుతున్నారనే విషయం తెలియడంతో సదరు యాజమాన్యం షర్మిలను ఉద్యోగం నుంచి తప్పించారు.దీంతో ఈమె ఉపాధి కోల్పోయారనే విషయం తెలిసి ఈ విషయం కాస్త తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయం నటుడు కమల్ హాసన్ దృష్టికి వెళ్లడంతో ఈయన స్వయంగా షర్మిలను తన ఆఫీసుకు పిలిపించి ఆమెకు కొత్త కారును బహుమానంగా ఇచ్చారు.ఇలా షర్మిలతో మాట్లాడిన కమల్ హాసన్ తనకు కారును బహుమానంగా ఇవ్వడమే కాకుండా దానిని క్యాబ్ గా మాత్రమే కాకుండా తన అవసరాల కోసం ఉపయోగించుకొని,ఎంతో మంది షర్మిలాలను తయారు చేయాలి అంటూ ఈయన ఆకాంక్షించారు. ఇలా డ్రైవర్ గానే మిగిలిపోకుండా ఎంతో మందికి ఉపాధి కల్పించి ఓ గొప్ప వ్యాపారవేత్తగా ఎదగాలంటూ ఈ సందర్భంగా కమల్ హాసన్ ఆమెకు కారును బహుకరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నటుడు కమల్ హాసన్ పై పలువురు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆపదలో ఆదుకున్న మహానీయుడంటూ కొనియాడుతున్నారు. https://twitter.com/koushiktweets/status/1673226724170174465 #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి