/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-33-3.jpg)
Kalki Fan War After Movie Release : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తెరకెక్కిన ‘కల్కి 2898AD’ మూవీ నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజై ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మహాభారతంలోని కొన్ని పాత్రలు తీసుకోని దానికి కొంత ఫిక్షన్ జోడిస్తూ నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని ఆడియన్స్ సినిమాపై ప్రసంశలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో కురుక్షేత్ర యద్దానికి సంబంధించి చూపించిన సీన్స్ హైలెట్ గా నిలిచాయి.అలాగే ప్రభాస్-అమితాబ్ పెర్ఫార్మెన్స్ నాగ్ అశ్విన్ మేకింగ్ ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేసాయి.
సినిమాలో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ సినిమా ప్రేక్షకులకు బాగానే నచ్చింది. 'కల్కి' రిలీజ్ తర్వాత తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫ్యాన్ వార్ నడుస్తోంది. అది మహాభారతంలోని రెండు పాత్రల మధ్య కావడం గమనార్హం. డైరెక్టర్ నాగ్ అశ్విన్ శంభాలాలో కల్కి పుట్టక ముందు ఏం జరుగుతుందో ఊహించి 'కల్కి' కథను రాసుకున్నాడు. సినిమా క్లైమాక్స్‌లో కురుక్షేత్ర యుద్ధంలోని అర్జున-కర్ణ యుద్ధ ఘట్టాన్ని తెరపై చూపించాడు. ఇందులో అర్జునుడిగా విజయ్ దేవరకొండ, కర్ణుడిగా ప్రభాస్ అద్భుతంగా నటించారు.
Also Read : ‘కల్కి’ లో కృష్ణుడిగా నటించిన ఇతను ఎవరో తెలుసా?
ఈ ఎపిసోడ్ కొన్ని సెకన్ల పాటు వచ్చి వెళ్లినా ఆడియన్స్ కు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఈ సీన్‌లో ప్రస్తావనకు వచ్చిన ఓ అంశం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. కర్ణుడు, అర్జునుడి మధ్య ఎవరు బలవంతుడు అనే వాదన మొదలైంది. 'కల్కి 2898 క్రీ.శ.' సినిమాలో కర్ణుడు అర్జునుడి కంటే బలవంతుడని చెప్పే సన్నివేశం ఉంది. అయితే కొందరు దీనిని కొందరు యాక్సెప్ట్ చేయడం లేదు. వ్యాసభారతంలో అలాంటి ప్రస్తావన లేదని వాళ్ళు చెబుతున్నారు.
దీనిపై పలువురు నెటిజన్స్ సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ హీరో.. దాంతో ప్రభాస్ పోషించిన కర్ణుడి పాత్ర హైలైట్ అవుతోంది. అర్జునుడి కంటే కర్ణుడు బలవంతుడని వ్యాసభారతం చెప్పలేదని నెట్టింట ఫ్యాన్ వార్ నడుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఏమో కర్ణుడు బలవంతుడే అని అంటున్నారు. నిజానికి కర్ణుడు అర్జునుడి సోదరుడు కూడా. కానీ విధి అతని స్వంత సోదరులతో యుద్ధంలో పాల్గొనేలా చేసింది. కానీ మహాభారతంలో వీరిద్దరూ అత్యంత శక్తివంతమైన పాత్రలుగా మిగిలిపోయారన్నది మాత్రం వాస్తవం.
Samantha: రెమ్యునరేషన్‌కు లింగ భేదం ఏంటీ..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సమంతా
సమంత ఇటీవల నటీనటుల పారితోషికాల్లో లింగ భేదంపై స్పందించింది. "హీరోతో సమానంగా పని చేసినా, రెమ్యునరేషన్‌లో తేడా ఎందుకు ఉంటుంది..? సమస్య ఎక్కడ ఉందో అక్కడే పరిష్కారం వెతకాలి" అని వ్యాఖ్యానించింది.
Samantha Latest Comments
Samantha: టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత ఇటీవల సినిమాలలో పెద్దగా మెరవకపోయినా, విభిన్నమైన పాత్రలుచేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. చివరిసారిగా 'ఖుషి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సమంత, ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో నటిస్తోంది. అంతేకాదు, నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందుతున్న వెబ్ సిరీస్ 'రక్త బ్రహ్మాండ్' లోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. మరోవైపు 'శుభం' అనే సినిమాను సమంత నిర్మాణ బాధ్యతలతో తెరకెక్కిస్తోంది.
Also Read: 'పెద్ది'తో రామ్ చరణ్ ఊచకోత.. ఇదయ్యా నీ అసలు రూపం..!
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సమంత, సినిమా పరిశ్రమలో హీరో, హీరోయిన్‌ల మధ్య పారితోషికంలో ఉండే అసమానతపై స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.
సమంతా మాట్లాడుతూ...
"చాలా సినిమాల్లో హీరోతో సమానంగా పని చేసినా, రెమ్యునరేషన్ మాత్రం సమానంగా ఉండేది కాదు. కొన్ని పెద్ద సినిమాల్లో కథ ఎక్కువగా హీరో చుట్టూ తిరుగుతుంది. అటువంటి సినిమాల్లో తేడా ఉంటే నేను అర్థం చేసుకోగలను. కానీ కొన్ని సినిమాల్లో కథనాయకుడు, కథానాయిక ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉండటంతోపాటు స్క్రీన్‌పై సమానంగా కనిపించినా పారితోషికంలో మాత్రం తేడా ఉంటుంది. ఇది ఇప్పటికీ అన్యాయం." అంటూ స్పందించింది.
Also Read: ఆ ఒక్క విషయంలో వెనక్కి తగ్గిన ఎన్టీఆర్ 'వార్-2'
ఇండస్ట్రీలో 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సమంత, ఇప్పటికైనా ఈ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.
"ఇప్పటికిప్పుడు అన్నీ మార్చలేకపోయినా, ఏదో ఒక మార్గం వెతకాలి. నేను చేయకపోతే మరెవరు చేస్తారు? సమస్య ఎక్కడైతే ఉంది, పరిష్కారాన్ని కూడా అక్కడే వెతకాలి అనే నమ్మకం నాకు ఉంది" అని సమంత వ్యాఖ్యానించారు.
Also Read: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్
Also Read: "క్రిష్ 4" లో ప్రియాంక చోప్రా ఫిక్స్..
పవన్ కల్యాణ్ ఇంటికి అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా?
ap: హమ్మయ్యా ఆంధ్ర రొయ్య అమెరికాకు.. కాకపోతే..!
🔴Live News Updates: నేడే కేబినెట్ భేటీ
Nalgonda Crime: నల్గొండలో విషాదం.. ప్రియుడు మోసం చేశాడని హాస్టల్లోనే యువతి..!
Ram Charan Peddi: 'పెద్ది'తో రామ్ చరణ్ ఊచకోత.. ఇదయ్యా నీ అసలు రూపం..!