Kalki 2898AD : అదరగొట్టిన 'కల్కి' ఓపెనింగ్స్.. తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే? ప్రభాస్ ‘కల్కి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ అందుకుంది. తొలి రోజు వరల్డ్ వైడ్ రూ.190 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ఫిలిం క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ వెల్లడించాడు. By Anil Kumar 28 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి 'Kalki 2898AD' Day 1 World Wide Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. పురాణాలకు సైన్స్‌ను ముడిపెట్టి నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ మూవీ అన్ని భాషల్లో హిట్ టాక్ తో దూసుకుపోతుంది. గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ అందుకుంది. ముఖ్యంగా నార్త్ లో కల్కి క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ప్రముఖ సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ వేదికగా కల్కి డే 1 కలెక్షన్స్ రిపోర్ట్ ను బయటపెట్టాడు. దాని ప్రకారం.. ఈ సినిమా కేవలం హిందీలోనే 22.50 కోట్ల నెట్, 27.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందట. ముఖ్యంగా నార్త్ లో ఉన్న టైర్2, టైర్ 3 సెంటర్స్ లో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. ఇప్పటికే అక్కడ మరిన్ని థియేటర్స్ ను సైతం యాడ్ చేసినట్లు తెసులుస్తోంది. Also Read : ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన విశ్వక్ సేన్.. కారణం అదేనా? అన్ని కోట్లా? ఇక నార్త్ లో భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ రూ.190 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ఫిలిం క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ వెల్లడించాడు. దీంతో ప్రభాస్ గత సినిమాల ఓపెనింగ్స్ ను 'కల్కి' డే 1 కలెక్షన్స్ బీట్ చేయడం విశేషం. ముందు ముందు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సుమారు రూ.600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించారు. ⭐️ Non-holiday. ⭐️ Midweek release . ⭐️ #INDvsENG2024 semi-final match. Yet, #Kalki2898AD embarks on a FANTASTIC START across the board... BIGGEST OPENER OF 2024 - #Hindi version only. East. West. North. And, of course, South - #Kalki2898AD wave grips the nation... Best… pic.twitter.com/EGO32MnDhC — taran adarsh (@taran_adarsh) June 28, 2024 #kalki-2898-ad #kalki-day-1-collections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి