/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-07T112425.279.jpg)
Student Suicide Idupulapaya IIIT: కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ(Idupulapaya IIIT) కళాశాలలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అర్థం లేని అనుమానం నిండు ప్రాణాన్ని బలిచేసింది. కాలేజీలోని సీనియర్లు ఫోన్ దొంగిలించావని తన పై వేసిన నిందను తట్టుకోలేక ప్రాణం తీసుకుంది ఓ అమాయకురాలు.
ప్రాణాలు తీసిన అనుమానం
ఇడుపులపాయ ఒంగోలు క్యాపస్ కు చెందిన జమీషాఖురేషి ట్రిపుల్ ఐటీ రెండవ సంవత్సరం చదువుతుంది. అయితే మంగళవారం మధ్యాహ్నం కాలేజీ క్యాంటీన్ వద్ద ఫైనల్ ఇయర్ కు చెందిన విద్యార్థిని మొబైల్ పోవడంతో... సీనియర్లు సెకండ్ ఇయర్ విద్యార్థిని జమీషాఖురేషినే ఫోన్ దొంగిలించినట్లుగా అనుమానించారు. తన పై దొంగతనం నిందవేయడంతో మనస్థాపానికి గురైన జమీషా బాత్రూం లోని వాటర్ పైపుకు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన అమ్మాయిది ప్రకాశం జిల్లా చీరాలగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం జమీషాఖురేషి మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Also Read : భారతీయులకు బ్యాడ్ న్యూస్.. వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు!