KA Paul: సీఎం జగన్ పై దాడి జరిగిందో లేక జరిపించుకున్నారో: కేఏ పాల్ సీఎం జగన్ పై దాడి జరిగిందో లేక జరిపించుకున్నారో ఎవరికి తెలుసని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. గతంలో కోడి కత్తి దాడి కూడా ఎన్నికల సమయంలో జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై విచారణ జరిగిన తర్వాతే మాట్లాడుతానని అన్నారు. By Jyoshna Sappogula 14 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి KA Paul: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పర్యటించారు. గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 133వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ పై దాడి జరిగిందో లేక జరిపించుకున్నారో ఎవరికి తెలుసని అన్నారు. Also Read: ఆ కక్షతోనే జగన్ పై దాడి చేశారు: కొడాలి నాని గతంలో కోడి కత్తి దాడి కూడా ఎన్నికల సమయంలో జరిగిందని వ్యాఖ్యానించారు. కోడి కత్తి కేసు ఇప్పటి వరకూ తేలలేదని పేర్కొన్నారు. సీఎం జగన్ పై జరిగిన దాడి నిజమైతే ఖండిస్తున్నానన్నారు. ఈ ఘటనపై విచారణ జరిగిన తర్వాతే మాట్లాడుతానని అన్నారు.. తమ్ముడు పవన్.. ముద్రగడ కూడా అమ్ముడుపోయారన్నారు. Also Read: ఆ ప్రతీకారంలో భాగంగానే సల్మాన్ హత్యకు కుట్ర.. తీహార్ జైలు నుంచి సుపారీ! విశాఖ ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. పిఠాపురంలో పోటీ చేసేందుకు కూడా ఆలోచిస్తున్నానన్నారు. పిఠాపురంలో వంగా గీత అభివృద్ధి చేయలేదని కామెంట్స్ చేశారు. దొంగలు గజదొంగలు అవినీతిపరులు నరహత్యలు చేసేవారు ప్రజల ముందుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలోచించి ప్రజాశాంతి పార్టీకి ఓటెయ్యండని ప్రజలను కోరారు. #ka-paul #andhra-pradesh-cm-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి