KA Paul: ఎలక్షన్ కమిషన్‌పై KA పాల్ సంచలన ఆరోపణలు తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం తన పార్టీకు గుర్తు కేటాయించడం లేదని ఆరోపించారు ప్రజాశాంతి పార్టీ అధినేత KA పాల్. నామినేషన్ వేసేందుకు తన మరో రెండు రోజుల సమయం కావాలని ఈసీని డిమాండ్ చేశారు. By V.J Reddy 09 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KA Paul Fire On Election Commission: తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈ సమయంలో ప్రజాశాంతి పార్టీ అధినేత KA పాల్ ఎన్నికల కమిషన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల కమిషన్ అధికారులు చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల టైం దగ్గరపడుతున్న కూడా తన పార్టీకి ఇంకా గుర్తు చేయలేదని అన్నారు. తన పార్టీకి గుర్తును కేటాయించాలని అడుగుతున్న అధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు. తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పాల్. ఇవాళ పార్టీ గుర్తు కేటాయించక పోవడంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. సెప్టెంబర్‌లోనే ప్రజాశాంతి పార్టీకి సంభందించిన అన్ని పాత్రలను ఈసీకి ఇచ్చినట్లు తెలిపారు. ALSO READ: రేవంత్ రెడ్డిని ఓడిస్తే నరేందర్ రెడ్డికి ప్రమోషన్.. కేటీఆర్ సంచలన ప్రకటన! కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అనంతరం KA పాల్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఎన్నికల కమిషనర్ నడుపుతున్నాడో లేదా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) నడుపుతున్నాడో అర్ధం కావడం లేదంటూ విమర్శించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతాడనే భయంతో తనను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్న షర్మిల(Sharmila) పెట్టిన పార్టీ YSRTPకి కూడా ఎన్నికల సంఘం గుర్తును కేటాయించిందని అన్నారు. మరి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు గుర్తును కేటాయించడం లేదని ప్రశ్నించారు. నామినేషన్లకు మరి కొన్ని గంటలే సమయం ఉందని.. తాను నామినేషన్ వేసేందుకు నామినేషన్ వేసే ఆఖరి తేదీని మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు. గొర్రెలు కసాయి వాడిని నమ్మినట్లే ప్రజలు కూడా అవినీతిపరులను నమ్మి వారికే అధికారం కట్టబెడుతున్నారని అన్నారు. చట్టాలు మారాలంటే తనలాంటి వారు ఎంపీ అయ్యి పార్లమెంట్‌లో గొంతు విప్పాలని అన్నారు. తన పోరాటంతోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపినట్లు కేఏ పాల్ తెలిపారు. ALSO READ: BJP Final List: ఆ 11 మంది ఎవరు?.. కొనసాగుతున్న ఉత్కంఠ! #kcr #ka-paul #telangana-elections-2023 #central-election-commission మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి