Hyderabad News: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం.. నడిరోడ్డుపై చిరువ్యాపారిని చితకబాదిన వైనం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనుచరుడు, రౌడీ షీటర్ తన్ను ఓ చిరువ్యాపారిని విచక్షణ రహితంగా కర్రతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నికల వేళ రౌడీ షీటర్ ను బైండోవర్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. By Nikhil 18 Nov 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అనుచరుడు, రౌడీ షీటర్ తన్ను మరో సారి తెగబడ్డాడు. ఓ వ్యక్తిని కర్రతో అతను కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరు వ్యపారి అడిగినంత మూమూళ్లు ఇవ్వలేదన్న కారణంతోనే దాడికి దిగినట్లు ప్రచారం సాగుతోంది. బాధితులు ఎంతగా ప్రాధేయ పడుతున్నా కూడా విచక్షణా రహితంగా కొడుతున్నట్లు వీడియోలో స్పష్టంగా అర్థం అవుతోంది. ఇది కూడా చదవండి: BREAKING: హైదరాబాద్ లో భారీగా నగదు పట్టివేత.. అవన్నీ పొంగులేటి పైసలేనా? #BRSParty #Jubileehills MLA #MagantiGopinath follower Tannu rowdy sheeter beating pushcart businessmen for not giving rowdy Mamool in #Hyderabad on Saturday. #PoliceState did nt bind over hi. #TelanganaElections2023. @HiHyderabad @AmitLeliSlayer @revanth_anumula @BJP4Telangana pic.twitter.com/cSt11hehhk — R V K Rao_TNIE (@RVKRao2) November 18, 2023 దాడి చేసిన వ్యక్తి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో కలిసి సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎమ్మెల్యే అండదండలతోనే రౌడీషీటర్ తన్ను రెచ్చిపోతున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల వేళ రౌడీ షీటర్ ను బైండోవర్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా పోలీస్ కమిషనర్ స్పందించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మనుషులు రెచ్చిపోవడం ఇది మొదటి సారి కాదు. నెల రోజుల క్రితమే మాగంటి గోపీనాథ్ కు దగ్గరి వ్యక్తి అయిన భాస్కర్ ఓ వ్యక్తిని నడిరోడ్డపై చితకబాదాడు. ఆ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో భాస్కర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల వేళ ఇలా అనుచరులు రెచ్చిపోయి సామాన్యులపై దాడులకు దిగడం ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి