Jogulamba Gadwala: బీఆర్ఎస్ నాయకులపై డీకే స్నిగ్థారెడ్డి ఫైర్ బండ్ల జ్యోతిమ్మ చేసిన వ్యాఖ్యలపై డీకే స్నిగ్ధారెడ్డి స్పందిచారు. గత ఎన్నికలో అన్ని అబద్ధాలు చెప్పి ప్రచారం చేసింది మీరు అని ఆమె మండిపడ్డారు. అన్ని తప్పుడు మాటలు మాట్లడుతుంటే ఒక్కసారి కూడా ఖండిచలేదని డీకే అరుణ కుతూరు అన్నారు. మేము ఏ తప్పు చేయలేదని స్నిగ్ధారెడ్డి స్పష్టం చేశారు. పాముకు పాలు పోస్తున్నారు?. వాడిని ఇంట్లోరానివ్వొద్దని నాన్నమ్మ చెప్పిందని ఆమె వ్యాఖ్యనించారు. By Vijaya Nimma 26 Aug 2023 in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి మా తాతపై అసత్య ఆరోపణలు చేశారు.. జోగులాంబ గద్వాల జిల్లా ( Jogulamba Gadwala district)లో బండ్ల కుటుంబంపై డీకే అరుణ కూతురు డీకే స్నిగ్థారెడ్డి (DK Snigtha Reddy) ఫైర్ అయ్యారు. ఐదు ఏళ్ల ముందు ఎన్నికల్లో మా తాతపై అసత్యమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన మీరు బండ్ల గురించి మాట్లాడే స్థాయి కాదని డీకే కుతూరు అన్నారు. 20 ఏళ్ల నుంచి భారత్ సింహరెడ్డి, కృష్ణ మోహన్‌రెడ్డిని కన్న కొడుకుల చూశాము. ఆయన అండదండలతో ఎమ్మెల్యే స్థాయికి చేరవని అన్నారు. కృష్ణమోహన్ రెడ్డికి పాలు పోసి పెంచుతున్నారని కాటేసి తత్వం అంటూ పలుసార్లు మా నాన్నమ్మ అనేదాని డీకే స్నిగ్ధారెడ్డి అన్నారు. Your browser does not support the video tag. ఆడబిడ్డలపై అరాచకాలు న్యాయ వ్యవస్థను గౌరవించే మనస్తత్త్వం మాదని, న్యాయ వ్యవస్థను గౌరవించకుండా ప్రజల్లో కంటతడి పెడుతూ అమాయకులను అయోమయనికి గురిచేసే మనస్తత్వం మీదన్నారు. మైనింగ్ విషయంలో నిండు గర్భిణీ అనీ చూడకుండా నన్ను కోర్టుల చుట్టు నీ భర్త తిప్పినప్పుడు ఎక్కడ ఉన్నావ్..? అంటూ బండ్ల జ్యోతిని ప్రశ్నించారు. నీ భర్తకు ఒక న్యాయం.. గద్వాల మహిళలకు ఒక న్యాయమా? న్యూడ్ కాల్స్ విషయంపై ఎంతో మంది ఆడబిడ్డలపై అరాచకాలు చేసిన బీఆర్ఎస్ నాయకులపై ఎందుకు స్పందించలేదు జ్యోతమ్మ అంటూ ఫైర్ అయ్యారు. మీరు ఏం అభివృద్ధి చేశారు..? ఏమన్నా అంటే డెవలప్ చేశామంటున్నారు. మా వల్లనే అభివృద్ధి చెందిందని మాట్లాడుతున్నారు. నర్సింగ్, మెడికల్ కాలేజీ తెచ్చామంటారు..? ఆ మెడికల్ కాలేజీ కోసం అరుణమ్మ పోరాడకపోతే నీకు ఆ కాలేజీలు సాధ్యమయ్యేటియా? అని ప్రశ్నించారు. అవి కొత్త జిల్లాల కోసం కేంద్ర ప్రభుత్వంప్రకటించింది. వనపర్తి జిల్లా కోసం పోరాటం చేశావు కానీ.. మన ప్రజల కోసం ఏ రోజు కూడా పోరాటం చేశావా?. నువ్వు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మహిళల్లో భయం ఎక్కువైంది. అభద్రత భావం పెరిగిందన్నారు. రౌడీయిజం, తప్పుడు కేసులు ఎక్కువైపోయాయి. అన్ని అవినీతి పనులు చేసుకుంటూ అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారు. చెప్పే మాటలు ఏమైనా అర్థం ఉందా అంటే స్నిగ్ధారెడ్డి ప్రశ్నించారు. #jogulamba-gadwala-district #dk-is-aruna-daughter #dk-snigtha-reddy #bandla-family మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి