మరింత తగ్గిన Group-1 హాజరు శాతం.. నేడు ఎంత మంది ఎగ్జామ్ రాశారంటే?

గ్రూప్-1 పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. ఈ రోజు జరిగిన General Essay ఎగ్జామ్ కు 69.4 శాతం అభ్యర్థులు హాజరైనట్లు TGPSC ప్రకటనలో పేర్కొంది. నిన్న నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

New Update
Group-1 Exam Updates latest updates

తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలు కొనసాగుతున్నాయి. నిన్న పేపర్-1 పరీక్ష నిర్వహించగా.. నేడు పేపర్-2 నిర్వహించారు. ఈ రోజు జరిగిన General Essay పరీక్షకు 69.4 శాతం అభ్యర్థులు హాజరైనట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. మొత్తం 31,383 అభ్యర్థులకు గాను 21,817 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించింది. ఈ మేరకు కమిషన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే.. నిన్న నిర్వహించిన జనరల్ ఇంగ్లిష్ పరీక్షకు 22744 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీంతో 72.4 శాతం హాజరు నమోదైనట్లు పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. తొలిరోజుతో పోల్చితే 3 శాతం హాజరు తగ్గింది. 

ఇది కూడా చదవండి: మూసీ నిర్వాసితులకు సర్కార్ బంపర్ ఆఫర్..200 గజాల స్థలం, రూ.30 లక్షలు..!

ఆఖరి నిమిషం వరకు వాయిదా కోసం ప్రయత్నం..

గ్రూప్-1 పరీక్ష వాయిదా కోసం అఖరి నిమిషం వరకు అభ్యర్థులు ప్రయత్నం చేశారు. జీవో నంబర్.29తో పాటు న్యాయస్థానాల్లో ఉన్న కేసులు తేలే వరకు వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు. నిన్న సుప్రీంకోర్టు సైతం పరీక్ష వాయిదాకు నిరాకరించడంతో గ్రూప్-1 మెయిన్స్ కు లైన్ క్లీయర్ అయ్యింది. దీంతో అభ్యర్థులంతా ఎగ్జామ్ కు హాజరయ్యారు. అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 

ఇది కూడా చదవండి: BREAKING: తెలంగాణలో కాంగ్రెస్ నేత దారుణ హత్య!

ఈ నెల 27 వరకు..

అయితే.. ఎలాంటి ఆందోళనలు, అవాంతరాలు లేకుండా పరీక్ష జరుగుతుండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్రూప్-1 పరీక్షల కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 46 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసింది టీజీపీఎస్సీ. ఆయా కేంద్రాల్లో ఈ నెల 27 వరకు ప్రతీ రోజు ఉదయం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు