వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టులు.. మరో వారం రోజులే

రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ కోర్సు కంప్లీట్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రంలో దాదాపు 2050 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. 

New Update
Breaking: స్టాఫ్ నర్స్ ఫలితాలు రిలీజ్..ఇలా చెక్ చేసుకోండి..!!

నర్సింగ్ కోర్సు కంప్లీట్ చేసిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 2050 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. 

నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు

  • ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ/ వైద్యవిద్య డైరెక్టరేట్ పరిధిలో 1576 స్టాఫ్ నర్సు పోస్టులు ఉన్నాయి.
  •  తెలంగాణ వైద్య విధానపరిషత్ పరిధిలో 332 పోస్టులు ఉన్నాయి.
  •  ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80 పోస్టులు ఉన్నాయి.
  •  ఆయుష్‌ విభాగంలో 61 పోస్టులు ఉన్నాయి.
  •  ఐపీఎంలో 1 స్టాఫ్ నర్సు పోస్టులు ఉన్నాయి.

విద్యార్హత: జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ (GNM) లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. SBIలో 10వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!

వయస్సు: 08.02.2024 నాటికి 18 నుంచి 46 సంవత్సరాల వయస్సు మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు కూడా ఉన్నాయి.

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మొత్తం 100 పాయింట్లకు ఎంపిక చేస్తారు. అందులో రాతపరీక్షకు 80 పాయింట్లు ఇవ్వనున్నారు. మిగతా 20 పాయింట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు వెయిటేజీ ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

ఇది కూడా చదవండి: డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు.. మరికొద్ది రోజులే

దరఖాస్తు చివరితేది: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా 14.10.2024 5.00 pm 

పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ ను సంప్రదించాల్సి ఉంటుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు