Jawan: బాహుబలి2 ను క్రాస్ చేసిన జవాన్

షారుఖ్ ఖాన్ తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ జవాన్. రిలీజైన మొదటి రోజు నుంచి ఈ సినిమా ఏదో ఒక రికార్డ్ సృష్టిస్తూనే ఉంది. ప్రతి రోజూ ఈ సినిమా, మరో సినిమాను క్రాస్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో షారూక్ గత చిత్రం పఠాన్ ను కూడా అధిగమించింది.

New Update
Jawan: బాహుబలి2 ను క్రాస్ చేసిన జవాన్

షారుఖ్ ఖాన్ తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ జవాన్. రిలీజైన మొదటి రోజు నుంచి ఈ సినిమా ఏదో ఒక రికార్డ్ సృష్టిస్తూనే ఉంది. ప్రతి రోజూ ఈ సినిమా, మరో సినిమాను క్రాస్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో షారూక్ గత చిత్రం పఠాన్ ను కూడా అధిగమించింది. తాజాగా నాలుగో వారంలోకి ఎంటరైన ఈ సినిమా, 21 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు హిందీ వెర్షన్‌లో 500 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద మరో మైలురాయిని అందుకుంది.

కేవలం హిందీ వెర్షన్ కే 500 కోట్ల రూపాయల నెట్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది జవాన్ మూవీ. బాహుబలి 2, పఠాన్, గదర్ 2 తర్వాత హిందీ భాషలో 500 కోట్ల నెట్‌ని క్రాస్ చేసిన 4వ చిత్రంగా ఇది నిలిచింది. ఈ క్రమంలో హిందీలో 500 కోట్ల క్లబ్ లో 2 సినిమాలు కలిగిన ఏకైక హీరోగా అవతరించాడు షారూక్. ఇక అన్ని భాషలతో కలుపుకుంటే, జవాన్ ఆల్ ఇండియా వసూళ్లు దాదాపు 600 కోట్ల రూపాయలు. అంతేకాకుండా.. బాహుబలి-2 హిందీ వసూళ్లను కూడా జవాన్ క్రాస్ చేసింది.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన జవాన్‌కి అట్లీ దర్శకుడు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా కథ రాసుకున్న అట్లీ, ఇప్పటివరకు ఎవ్వరూ చూపించని విధంగా షారూక్ ను సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో అతడు బాలీవుడ్ లో క్లిక్ అవ్వడమే కాదు, హీరోయిన్ నయనతారను కూడా బాలీవుడ్ కు సక్సెస్ ఫుల్ గా పరిచయం చేశాడు.

వినోదంతో పాటు సామాజిక, రాజకీయ అంశాలను హైలైట్ చేసే ఈ కథలో షారూఖ్ ఖాన్ విక్రమ్ రాథోడ్ గా, మరో పాత్రలో అతని కుమారుడు ఆజాద్‌గా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు. ప్రత్యేక అతిధి పాత్రల్లో దీపికా పదుకొనే, సంజయ్ దత్ కూడా నటించారు.

సన్యా మల్హోత్రా, ప్రియమణి, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి, సునీల్ గ్రోవర్, ముఖేష్ ఛబ్రా కూడా ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాతో తన సక్సెస్ రేంజ్ ను మరింత పెంచుకున్నాడు షారూక్. ఇన్నాళ్లూ వరుసగా ఫ్లాపులు చూసిన ఈ హీరో, పఠాన్ తో గాడిలో పడ్డాడు. ఇప్పుడు జవాన్ తో తన స్టార్ డమ్ ను మరోసారి నిరూపించుకున్నాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

రవితేజ ‘మాస్ జాతర’ నుంచి వచ్చేసిన మాస్ సాంగ్.. చూపుల్తో గుచ్చి గుచ్చి.. మ్యూజిక్, స్టెప్స్‌తో అదిరిపోయాయిగా!

మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుంచి ‘తు మేరా లవర్’ లిరికల్ సాంగ్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. చూపుల్తో గుచ్చి గుచ్చి మ్యూజిక్, సెప్స్‌తో వింటేజ్ రవితేజను గుర్తుచేశారు. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది.

New Update

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) "మాస్ జాతర" మూవీతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన తు మేరా లవర్ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి బీట్, డ్యాన్స్‌ను రీమేక్ చేసి మధ్యలో యాడ్ చేశాడు.  

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

వింటేజ్ రవితేజను గుర్తు చేసేలా..

ఈ పాట అప్పట్లో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అవే స్టెప్‌లు, మ్యూజిక్‌ వింటేజ్ రవితేజను గుర్తు చేశాయి. ఈ మాస్ సాంగ్‌లో రవితేజ, శ్రీలీల మాస్ బీట్స్‌తో అదరిగొడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాట ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

Advertisment
Advertisment
Advertisment