Crime: మత్తు మందు ఇచ్చి ముగ్గురు బాలికలపై అత్యాచారం! చత్తీస్ గఢ్ లో జష్‌పూర్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు మైనర్ బాలికల పై అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. రెండు వేరువేరు ఘటనల్లో నలుగురు నిందితులు అత్యాచార ఘటనలకు పాల్పడ్డారు.ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. By Bhavana 03 Apr 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి చత్తీస్ గఢ్ లో జష్‌పూర్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు మైనర్ బాలికల పై అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. రెండు వేరువేరు ఘటనల్లో నలుగురు నిందితులు అత్యాచార ఘటనలకు పాల్పడ్డారు. ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రెండు ఘటనలు పాతల్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలికల వయస్సు 15 నుంచి 17 ఏళ్ల మధ్యనే ఉంది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఈ రెండు ఘటనల్లో ఓ కేసులో ముగ్గురు, మరో కేసులో ఓ యువకుడిపై కేసు నమోదు చేశారు. ఈ దారుణ ఘటనతో బాధిత బాలికలు భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం మైనర్ బాలుడితో సహా ముగ్గురు నిందితులు తమ కారులో ఇద్దరు అక్కచెల్లెళ్లలతో పాటు ముగ్గురు మైనర్ బాలికలను కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు. నిందితులు ముగ్గురిని పొరుగు జిల్లా సుర్గుజాలోని మైన్‌పట్‌కు తీసుకెళ్లారు. అక్కడ నిందితులు ముగ్గురు బాలికలకు కూల్ డ్రింక్ లో మద్యం కలిపి ఇచ్చారు. అది తాగిన తర్వాత వారంతా అపస్మారక స్థితికి చేరుకున్నారు. అత్యాచారం చేసిన తరువాత నిందితులు వారిని పాతాల్‌గావ్ బస్టాండ్‌లో వదిలేశారు. బాధిత బాలికలలో ఒకరు సాయం కోసం తన 17 ఏళ్ల స్నేహితుడికి ఫోన్ చేసింది. సాయం అందించాడానికి వచ్చిన ఆ బాలుడు వారిని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ నిందితుడైన బాలుడు మరోసారి ఆ బాలికల పై అత్యాచారానికి పాల్పడ్డాడు. మిగిలిన ఇద్దరు బాలికలు విషయాన్ని వారి కుటుంబాలకు తెలియజేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. బాలిక ఫిర్యాదుతో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరిని సునీల్, అభిషేక్‌లుగా గుర్తించారు. ఒక నిందితుడు మైనర్. Also read: అభిలాష్ మృతిపై వీడని మిస్టరీ #crime #chatisghad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి