/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-06T105843.933.jpg)
Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే 'మిస్టర్ అండ్ మిసెస్' సినిమాతో మరో సూపర్ హిట్ అందుకుంది. బాలీవుడ్ లో రాణిస్తూనే.. టాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ. జూనియర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన మ్యూజికల్ ఆల్బమ్స్ లో జాన్వీ తన అందాలు, అదిరిపోయే స్టెప్పులతో అభిమానులను ఫిదా చేస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో మరో స్టార్ హీరో రామ్ చరణ్ సరసన RC16లో నటిస్తోంది.
జాన్వీ కొత్త సినిమా
ఇలా బాలీవుడ్, టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ముందుకెళ్తున్న జాన్వీ.. తాజాగా మరో సినిమా సైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బీటౌన్ సర్కిల్ టాక్ ప్రకారం జాన్వీ సిద్దార్థ్ మల్హోత్రాతో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రాన్ని దినేష్ జైన్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. దినేష్ విజయ్ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన 'స్త్రీ 2' బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన 3 వారాల్లోనే 500 వందల కోట్లకు పైగా వసూళ్లతో కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద షారుఖ్ ఖాన్ జవాన్, ప్రభాస్ సలార్ వంటి సినిమాల ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసింది.
ఇది ఇలా ఉంటే 'దేవర' సెప్టెంబర్ 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలు పోషించారు. యువసుధా, ఎన్టీఆర్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Also Read: Janhvi Kapoor: తల్లి సినిమాలపై జాన్వీ సంచలనం.. ఏమన్నారంటే? - Rtvlive.com