Janasena: ఆచంట నుంచి పోటీకి సిద్ధపడ్డాను..కానీ ఇలా జరిగింది.. జనసేన నేత సూర్యప్రకాష్ కీలక వ్యాఖ్యలు

ఆచంట నియోజవర్గం నుంచి తాను పోటీకి సిద్ధపడినట్లు తెలిపారు జనసేన ఇంఛార్జ్ చేగొండి సూర్య ప్రకాష్. అయితే, పొత్తులో భాగంగా టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు సీటు కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయమే శిరోధార్యమన్నారు.

New Update
Janasena: ఆచంట నుంచి పోటీకి సిద్ధపడ్డాను..కానీ ఇలా జరిగింది.. జనసేన నేత సూర్యప్రకాష్ కీలక వ్యాఖ్యలు

Achanta Assembly Constituency: వారం రోజుల్లో టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటన వెలువడుతుందన్నారు జనసేన పీఏసీ మెంబర్, ఆచంట నియోజవర్గ ఇంఛార్జ్ చేగొండి సూర్య ప్రకాష్. జనసేనకు రావాల్సిన సీట్లు జనసేనకు వస్తాయని.. జనసైనికులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. టీడీపీతో పొత్తు లేనప్పుడు ఆచంట నుంచి తాను పోటీకి సిద్ధపడినట్లు తెలిపారు. ప్రస్తుతం పొత్తులో భాగంగా టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు సీటు కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read: వైసీపీలో అభ్యర్థుల మార్పు చేర్పులు ఇందుకే.. బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే ఎక్కడి నుండి అయిన పోటికి సిద్ధమన్నారు. ఆచంట నియోజకవర్గ జనసైనికులు తనను పోటీ చేయాలనీ కోరుతున్నారని.. అయితే జనసేనాని నిర్ణయమే శిరోధార్యమని అన్నారు. నియోజకవర్గంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పాదయాత్రలో తాను కూడా పాల్గొంటున్నారని వెల్లడించారు. టీడీపీ, జనసేనకు నియోజకవర్గంలో ఎటువంటి బేధాభిప్రాయాలు లేవని పేర్కొన్నారు.

Also Read: కస్టమర్ కు యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ బిగ్ షాక్..!

ప్రస్తుత పరిస్థితిలో తాను చట్ట సభలకు వెళ్ళకపోయినా భవిష్యత్త్ లో వెళ్లి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై విసిగిపోయిన ప్రజలు వారిని ఇంటికి సాగనంపేందుకు సంసిద్ధంగా వున్నారని వ్యాఖ్యనించారు. నరసాపురం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి ఉమాబాల పై జనసేన, టీడీపీ అభ్యర్థి లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందుతామని జోస్యం చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు