BIG BREAKING: జగన్ పిటిషన్.. స్పీకర్‌కు నోటీసులు AP: తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది. రూల్ పొజిషన్ వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. By V.J Reddy 30 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి YCP Chief Jagan: తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ చెప్పట్టింది. రాజకీయ కక్షతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని జగన్ తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. జగన్ ను ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించేలా చూడాలి అని కోర్టును కోరారు. ఈ క్రమంలో దీనికి కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది. రూల్ పొజిషన్ వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. 11 కు ప్రతిపక్ష హోదానా? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. వైనాట్ 175 అని ఎన్నికల ప్రచారంలో జగన్ కు ఎన్నికల ఫలితాలు భారీ షాక్ ఇచ్చాయి. ఇది కేవలం జగన్ కే కాదు యావత్ దేశానికే ఊహించాని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అధికారంలో ఉన్న పార్టీ కోలుకోలేకుండా కేవలం 11 స్థానాలకు పరిమితం కావడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలి కావచ్చు. కాగా కేవలం 11 స్థానాలకు పరిమితం అయిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించలేదు స్పీకర్. దీంతో జగన్ కోర్టు మెట్లు ఎక్కాడు.. తనకు ప్రతిపక్ష కల్పించేలా చూడాలని కోర్టును కోరారు, దీనిపై విచారణ కొనసాగుతోంది. కాగా కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. Also Read : కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే #jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి