AP CM Jagan: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్

జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను విడుదల చేశారు ఏపీ సీఎం జగన్. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ. 41. 60 కోట్లను విడుదల చేశారు. రూ. 8 లక్షల వార్షికాదాయం లోపు ఉన్న వారందరికీ ఈ పథకం అందిస్తున్నట్లు తెలిపారు.

New Update
YCP Focus:  విశాఖపై వైసీపీ స్పెషల్ ఫోకస్..!

Jagananna Vedeshi Vidya Deevena Funds: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(AP CM Jagan mohan reddy) జగనన్న విదేశీ విద్యా దీవెన(Jagananna Vedeshi Vidya Deevena) నిధులను విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ. 41. 60 కోట్లను విడుదల చేశారు. జగనన్న విదేశి విద్యా దీవెనపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని తెలిపారు.

Also Read: ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలి… అసెంబ్లీలో భట్టి విక్రమార్క

రూ. 8 లక్షల వార్షికాదాయం లోపు ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నట్లు తెలిపారు. పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీల్లో చదువుతున్నారని వెల్లడించారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దని..వారు ఇబ్బందులు పడకూడదని ఈ పథకం అందిస్తున్నట్లు వ్యాఖ్యనించారు. సివిల్స్ అభ్యర్థులకు జగనన్న ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ. లక్ష..మెయిన్స్ పాస్ అయిన వారికి రూ. లక్షా 50 వేలు అందిస్తున్నట్లు వెల్లడించారు.పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే ఈ పథకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు