ప్రకాశం పంతులుకి నివాళులు ఆర్పించిన జగన్, చంద్రబాబు! ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 152 వ జయంతి సందర్భంగా ఏపీ ప్రముఖులు ఆయనకు నివాళులు ఆర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. By Bhavana 23 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్ర కేసరి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 152 వ జయంతి సందర్భంగా ఏపీ ప్రముఖులు ఆయనకు నివాళులు ఆర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. ''స్వాతంత్య్ర సమరయోధుడిగా బ్రిటీష్ వారి తుపాకీలకు గుండె చూపిన ప్రకాశం పంతులు గారి చరిత్రను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని ఈ సందర్భంగా జగన్ అన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్ర ఎంతో కీలకమైనదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఆయన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినందుకు ఆయనకు ఏపీ ప్రభుత్వం తరుఫున ఘనమైన నివాళులు అంటూ జగన్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు వారి పౌరుషానికి ఆత్మస్థైర్యానికి నిలువుటద్దం టంగుటూరి ప్రకాశం పంతులు అని చంద్రబాబు కొనియాడారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా..తెల్లదొరల తుపాకీలకు గుండెలు చూపిన ధైర్య వంతుడు, గొప్ప దేశ భక్తుడు ఆయన అని కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆయన పదవిలో ఉన్నా, లేకపోయినా కూడా ఆయన ప్రజల సంక్షేమమే ఊపిరిగా బతికిన గొప్ప ప్రజా నాయకుడు ఆయన అని కొనియాడారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లోనే 14 నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభించిన రైతు బాంధవుడు ప్రకాశం గారని కొనియాడారు. ఆ మహానుభావుని జయంతి సందర్భంగా ఆంధ్రకేసరి స్మృతికి నివాళులు అని చంద్రబాబు ట్వీట్ చేశారు. #jagan #cbn #prakasam-panthulu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి