Jabardasth Pavithra : జబర్దస్ద్ లేడీ కమెడియన్ కారుకు ఘోర ప్రమాదం.. యాక్సిడెంట్ వీడియో షేర్ చేసిన పవిత్ర! జబర్దస్త్ పవిత్ర ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ నెల 11న సొంతూరులో ఓటు వేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడినట్లు పవిత్ర స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. By Anil Kumar 19 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Jabardasth Comedian Pavithra Car Accident : బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ (Jabardasth) తో లేడీ కమెడియన్ (Lady Comedian) గా మంచి గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. ఓ వైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానెల్ సైతం మైంటైన్ చేస్తోంది. అప్పుడప్పుడు ప్రైవేట్ ఈవెంట్స్ లోనూ సందడి చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే తాజాగా పవిత్ర (Pavithra) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి (Car Accident) గురైంది. ఈ నెల 11న సొంతూరులో ఓటు వేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడినట్లు పవిత్ర స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. Also Read : హైదరాబాద్ లో మలేషియా సెట్.. ‘పుష్ప 2’ కోసం సుకుమార్ భారీ స్కెచ్? వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే ఏపీ ఎలక్షన్స్ (AP Elections) నేపథ్యంలో ఓటేసేందుకు పవిత్ర హైదరాబాద్ నుంచి తన స్వస్థలం సోమశిలకు కారులో బయలుదేరింది. ఈ క్రమంలోనే నెల్లూరు ఉప్పలపాడు హైవే వద్ద ఎదురుగా వచ్చిన మరో కారు పవిత్ర కారును ఢీకొట్టింది. దీంతో కారు ముందు టైర్ ఊడిపోయి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. సమయానికి కారులోని ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో ఈ ప్రమాదం తప్పింది. కాగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో పవిత్రతో పాట కారులో బంధువులు సైతం ఉన్నారు. వాళ్లంతా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేస్తూ నేను, పిన్ని, పిల్లలందరూ ప్రాణాలతో బయటపడ్డామని, ఆ సంఘటన మళ్ళీ తలుచుకుంటేనే భయమేస్తుందని, ఎంతో కష్టపడి కొనుక్కున్న కారు నాశనం అయిందని ఆవేదన వ్యక్తం చేసింది. #ap-elections-2024 #jabardast-comedian-pavithra #jabardath-pavithra-car-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి