/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-20T121928.010.jpg)
Raju Yadav : కృష్ణమాచారి దర్శకత్వంలో జబర్దస్త్ (Jabardasth) ఫేమ్ గెటప్ శ్రీను (Getup Srinu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాజు యాదవ్'. ఈ ఏడాది మే 24న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.
'రాజు యాదవ్' ఓటీటీ రిలీజ్
తాజాగా 'రాజు యాదవ్' (Raju Yadav) ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' (Aha) లో జులై 24 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్, సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ అంకిత ఖారత్ (Ankita Kharat) కథానాయికగా నటించగా.. ఆనంద్ చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మూవీ స్టోరీ
ఈ సినిమాలో హీరో రాజ్ యాదవ్ కు ఒక గేమ్ ఆడుతుండగా అనుకోకుండా ముఖానికి గాయం అవుతుంది. దీంతో అతని మొహానికి సర్జరీ చేస్తారు డాక్టర్లు. ఇక ఆ సర్జరీ తర్వాత రాజ్ యాదవ్ మొహం ఏడ్చినా, కోపంలో ఉన్నా... నవ్వినట్లే కనిపిస్తుంది. ప్రతీ ఎమోషన్ కు అతని మొహం పై నవ్వే కనిపిస్తుంది. ఇక దీని వల్ల రాజ్ యాదవ్ తన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేది మూవీ స్టోరీ.
Raju yadav manodu, mee aha lo vasthunnadu!😎
Yaadh maravakurri...ee month 24th na vasthundu🕺🏻The Crazy Entertainer #RajuYadav premieres July 24th only on aha!@getupsrinu3 @RocketRaghava @mirchihemant @iamankitakharat @actorchakrapani @PawonRamesh @PrashanthUttar1 pic.twitter.com/3ANM2lU4XF
— ahavideoin (@ahavideoIN) July 18, 2024
Also Read:Brahmamudi: రాజ్- కావ్య డిన్నర్ ప్లాన్.. రుద్రాణి కుట్రకు బలైన రాహుల్..! - Rtvlive.com