Faima : నన్ను నెగిటివ్ చేస్తున్నారు.. అందుకే దూరమయ్యాం, ప్రవీణ్ తో బ్రేకప్ పై స్పందించిన ఫైమా!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫైమా ప్రవీణ్ తో బ్రేకప్ గురించి స్పందిస్తూ.." నా కు, ప్రవీణ్ కి మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని, అందుకే దూరం కావాల్సి వచ్చిందని" చెప్పింది .

New Update
Faima : నన్ను నెగిటివ్ చేస్తున్నారు.. అందుకే దూరమయ్యాం, ప్రవీణ్ తో బ్రేకప్ పై స్పందించిన ఫైమా!

Faima Response On Breakup With Praveen : జబర్దస్త్ కామెడీ షోలో మేల్ కమెడియన్స్ కి సమానంగా కొందరు లేడీ కమెడియన్స్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. అందులో ఫైమా కూడా ఒకరు. పటాస్, జబర్దస్త్ లాంటి షోలలో తనదైన పంచులు, ప్రాసలతో కామెడీ క్వీన్ గా పేరు తెచ్చుకుంది ఫైమా. అదే క్రేజ్ తో బిగ్ బాస్ లోకి సైతం వెళ్ళింది.

publive-image

అయితే జబర్దస్త్ లో తన తోటి కమెడియన్ ప్రవీణ్ తో ఫైమా ప్రేమలో ఉందని గతంలో వార్తలొచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి రీల్స్ చేయడం, ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం లాంటివి చూసి ఆడియన్స్ సైతం ఇది నిజమని అనుకున్నారు. ఆలోపే ఈ ఇద్దరికీ బ్రేకప్ జరిగిందంటూ న్యూస్ వైరల్ అయింది. ఆ మధ్య ప్రవీణ్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఫైమా తన ప్రేమను రిజెక్ట్ చేసిందని చెప్పాడు. ఇక తాజాగా ఇదే విషయం పై ఫైమా స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

publive-image

Also Read : సమంత సెమీ న్యూడ్ ఫొటోపై రచ్చ.. ఇదే నిజమైన విజయం అంటూ నటి పోస్ట్!

ఆ సమస్యల వల్లే దూరం

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫైమా ప్రవీణ్ తో బ్రేకప్ గురించి స్పందిస్తూ.. " టీవీ షోలలో కనిపించే జోడీలు ఏవీ నిజం కాదు. అవి నిజం అని నమ్మొద్దు. ప్రవీణ్, నన్ను ఆన్ స్క్రీన్ లో జోడిగా చూపించారు. దాంతో మా జంటను ఆడియన్స్ బాగా ఆదరించారు. దాన్ని వాడుకొని యూట్యూబ్ లో వీడియోలు చేశాం. నాకు,ప్రవీణ్ కి మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. అవి ఇక్కడ చెప్పుకోలేం. అందుకే దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మేమిద్దరం మాట్లాడుకోవట్లేదు"

publive-image

నన్ను నెగిటివ్ చేస్తున్నారు

ఒకప్పుడు మా రిలేషన్, అండర్ స్టాండింగ్ అంతా బాగుండేది. కొన్ని విషయాల వాళ్ళ మా మధ్య దూరం పెరిగింది. అలాంటప్పుడు పర్సనల్ గా నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి. అంతే కానీ అతనికి పేరెంట్స్ లేకపోవడంతో తాను మీడియా ముందు మాట్లాడే మాటలనే సింపతీకి దారి తీస్తున్నాయి. దాంతో అతను ఏం చెప్పినా విని జనాలు నన్ను నెగటివ్ చేస్తున్నారు. దయచేసి మా రిలేషన్ కి ఏ పేరు పెట్టకండి" అంటూ చెప్పుకొచ్చింది.

publive-image

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Allu Arjun - Atlee Movie: బట్టలు చించుకునే టైం ఆగయా.. హాలీవుడ్ రేంజ్‌లో అల్లు అర్జున్- అట్లీ మూవీ (వీడియో చూశారా)

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ అయింది. బన్నీ తన కెరీర్‌లో 22వ చిత్రాన్ని అట్లీతో చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో భారీగా వీఎఫ్ఎక్స్ కోసం డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

New Update
allu arjun and atlee

allu arjun and atlee

ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా బన్నీ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ తన కెరీర్‌లో 22వ మూవీని కోలీవుడ్ స్టార్ అట్లీతో చేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు బర్త్ డే స్పెషల్‌గా రిలీజ్ చేసిన వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఏకంగా హాలీవుడ్ రేంజ్ ను తలపించే వీఎఫ్ ఎక్స్‌ను ఆ వీడియోలో చూపించి అదరగొట్టేశారు. 

దీని బట్టి చూస్తే అల్లు అర్జున్ - అట్లీ మూవీ ఎక్కువగా వీఎఫ్ఎక్స్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఒక వీఎఫ్ఎక్స్ కంపెనీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడ బన్నీ లుక్‌ను టెస్ట్ చేశారు. ఫుల్ యాక్షన్ సన్నివేశాలకు బన్నీ లుక్ ఎలా ఉంటుందో చూపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

(allu-arjun | hbd-allu-arjun | atlee | allu-arjun-atlee-movie | director-atlee | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment