IT Returns 2024: ఐటీ రిటర్న్స్ లాస్ట్ డేట్ లోపు సబ్మిట్ చేయకపోతే జరిగేది ఇదే!

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి తేదీ దగ్గరకు వచ్చేస్తోంది. ఇప్పటికీ చాలామంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదని చెబుతున్నారు. ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేస్తే ఇబ్బందులే కాకుండా ఆర్థికంగానూ నష్టం వస్తుంది. లేట్ గా ఐటీఆర్ ఫైల్ చేస్తే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుంది.

New Update
IT Returns 2024: ఐటీ రిటర్న్స్ లాస్ట్ డేట్ లోపు సబ్మిట్ చేయకపోతే జరిగేది ఇదే!

IT Returns 2024: ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. వీరిలో చాలామంది తమ రిటర్న్స్ ను ఇన్ టైమ్ లో డిపాజిట్ చేయలేరు. లేటుగా ఐటీఆర్ ఫైల్ చేయడంతో వీరు నష్టపోతారు. అంటే, ఐటీఆర్ ఫైల్ చేయడం ఆలస్యం అయినందుకు వీరంతా భారీగా జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఆలస్యం అయితే ఏమవుతుంది? ఎంత ఫైన్ ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. 

IT Returns 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్  చేయడానికి చివరి తేదీ 31 జూలై 2024. ఈ గడువు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే, మీరు పెనాల్టీని ఎదుర్కొంటారు. రిటర్న్‌లను ఆలస్యంగా దాఖలు చేస్తే రూ. 5,000 ఫిక్స్ డ్ ఫైన్ కట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా,  రూ. 10,000 కంటే ఎక్కువ టాక్స్ కట్టాల్సి వచ్చిన వారు బ్యాలెన్స్ ఉన్న టాక్స్  మొత్తంపై నెలకు అదనంగా 1% వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.

IT Returns 2024: ITR ఫైల్ చేయడంలో టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అంటే మూలం దగ్గర పన్ను మినహాయించే విధానం చాలా ముఖ్యమైనది.  ఒకవేళ రూ. 50 లక్షలకు పైబడిన ప్రాపర్టీ కొనుగోళ్లపై మినహాయించిన తర్వాత కూడా TDS కట్ చేయకపోతే, లేదా ప్రభుత్వ ఎకౌంట్ కు ట్రాన్సఫర్  చేయకపోతే నెలకు 1% నుండి 1.5% వరకు జరిమానా విధిస్తారు.  ఇది కాకుండా, ఇన్సూరెన్స్ లో  తప్పు పాన్ నంబర్ ఇచ్చినందుకు రూ. 10,000 జరిమానా వేస్తారు. అయితే రూ. 2 లక్షల కంటే ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కు కూడా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

గడువు తేదీ తర్వాత ITR దాఖలు చేసినట్లయితే, అనేక రకాల రిటర్న్‌లను క్లెయిమ్ చేయడం వీలుకాదు.  మీ అవగాహన కోసం, చివరి తేదీ తర్వాత ITR ఫైల్ చేసినట్లయితే, సెక్షన్ 10A, 10B, 80-IA, 80-IB, 80-IC, 80-ID -  80-IE కింద మినహాయింపు అందుబాటులో ఉండకపోవచ్చు. పన్ను ప్రయోజనాలను పెంచుకోవడానికి అలాగే,  అనవసరమైన ఆర్థిక భారాలను నివారించడానికి ఇన్ టైమ్ లో ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా అవసరం. ఇది గుర్తుఎంచుకోవాల్సిన విషయం. ఇంకా మీరు మీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే, వెంటనే ఆ పని చేయండి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు