Abhishek Agarwal: 'టైగర్ నాగేశ్వర్ రావు' నిర్మాతకు షాక్..! టెన్షన్ లో రవితేజ..!

'టైగర్ నాగేశ్వర్ రావు' నిర్మాత అభిషేక్ అగర్వాల్ నివాసంలో ఐటి సోదాలు నిర్వహించారు. ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉన్న నివాసంతో పాటు కార్యాలయంలో కూడా  సోదాలు నిర్వహించారు .

New Update
Abhishek Agarwal: 'టైగర్ నాగేశ్వర్ రావు' నిర్మాతకు షాక్..! టెన్షన్ లో రవితేజ..!

Abhishek Agarwal: రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వర్ రావు' (Tiger Nageswara Rao) నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Producer Abhishek Agarwal) నివాసంలో ఐటీ సోదాలు నిర్వహించారు. ఇటీవలే టైగర్ నాగేశ్వర్ రావు సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ కు ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా చాలా త్రిల్లింగ్ గా, భారీ అంచనాలతో ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను నిర్మాతలు పాన్ ఇండియా స్థాయిలో రీలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

'టైగర్ నాగేశ్వర్ రావు' నిర్మాత అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) నివాసంలో ఐటి సోదాలు నిర్వహించారు. ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉన్న నివాసంతో పాటు కార్యాలయంలో కూడా  సోదాలు నిర్వహించారు . కాశ్మీర్ ఫైల్స్ సీక్వెల్, ది ఢిల్లీ ఫైల్స్ సినిమాను  నిర్మించారు అభిషేక్ అగర్వాల్. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన 'టైగర్ నాగేశ్వరరావు' త్వరలో విడుదల కానుంది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ గతంలో 'కిర్రాక్ పార్టీ', గూడాచారి1, గూడాచారి 2, కాజల్ అగర్వాల్ నటించిన సీత ఇలా పలు సినిమాలను నిర్మించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత మాత్రమే కాదు వ్యాపార వేత్త కూడా ఈయన అభిషేక్ గ్రూప్ సంస్థ MD. 'A1 Express' సినిమాతో ఆయన నిర్మాత గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.

ప్రస్తుతం ఈ చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా ఉన్నారు. తాజాగా 'టైగర్ నాగేశ్వర్ రావు' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో రవితేజ (Ravi Teja) రియాలిటీ షో బిగ్ బాస్ లో కనిపించారు. డైరెక్టర్ వంశీ ఈ సినిమాను తెరక్కెక్కించగా అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. 'స్టువర్టుపురానికి' (Stuartpuram) చెందిన పేరు మోసిన గజ దొంగ 'గోకరి నాగేశ్వరరావు' జీవితం ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'టైగర్ నాగేశ్వర్ రావు' సినిమా విడుదలకు సిద్దమవుతున్న ఈ సమయంలో  నిర్మాత అభిషేక్ అగర్వాల్ నివాసంలో ఐటీ సోదాలు (IT raids) సినిమాపై ఏమైనా ప్రభావం చూపుతాయా అనే టెన్షన్ లో ఉన్నారు మూవీ బృందం. హీరో రవితేజ కూడా సినిమా విడుదల సజావుగా సాగుతుందో లేదో అని  టెన్షన్ లో ఉన్నట్లు సమాచారం. భారీ అంచనాలతో తీసిన ఈ సినిమా విడుదల సమయంలో ఇలా జరగడం చిత్ర బృందాన్ని టెన్షన్ పెడుతున్నట్లు తెలుస్తుంది.

Also Read: Amitabh Bachchan: బిగ్ బీ అందుకే చెప్పులు లేకుండా వస్తారా..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రవస్తి ఆరోపణలు.. పాటతో కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత

సింగర్ సునీత ఇన్‌డైరెక్ట్‌గా ప్రవస్తిని ఉద్దేశించి ఓ పోస్ట్ చేశారు. గోపీచంద్‌ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలో కీరవాణి సంగీతం అందించిన 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు అనే పాటను షేర్ చేశారు. ప్రవస్తి గురించే ఈ పాటను షేర్ చేశారని నెటిజన్లు అంటున్నారు.

New Update
singer pravasthi comments on Sunitha

singer pravasthi comments on Sunitha

గాయని ప్రవస్తి పాడుతా తీయగా షోలోని జడ్జిలపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వారికి నచ్చిన వారికే ప్రోగ్రాంలో ఎంకరేజ్ చేస్తారని మిగతా వారిని తొక్కేస్తారని సింగర్ ప్రవస్తి కామెంట్లు చేసింది. అలాగే తనని బాడీ షేమింగ్ చేశారని తెలిపింది. అయితే దీనికి సింగర్ సునీత స్పందిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రవస్తి కూడా సునీత కోసం వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

కీరవాణి అందించిన పాటను..

ఈ క్రమంలో సింగర్ సునీత మరో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ప్రవస్తి గురించి డైరెక్ట్‌గా కాకుండా.. లిరిక్స్‌ను షేర్ చేశారు. గోపీచంద్‌ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలో కీరవాణి సంగీతం అందించిన పాటను ఆమెను షేర్ చేశారు. 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు.. కోరిన తీరాన్నే చేరుకునే వరకు ఓ నిమిషమైనా నిదరపోవా..' అనే లిరిక్స్‌ పాటను షేర్ చేశారు. అయితే సునతీ సింగర్ ప్రవస్తి గురించే పాటను షేర్ చేశారని నెటిజన్లు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

ఇదిలా ఉండగా పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో చాలా మంది సింగర్లు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అయితే ఈ షోలో జడ్జెస్‌గా సునీత, కీరవాణి, చంద్రబోస్‌లపై గాయని ప్రవస్తి ఆరోపణలు చేసింది. జడ్జిమెంట్‌ విషయంలో వివక్ష చూపుతున్నారని, కొందరు పాడకపోయినా కూడా సపోర్ట్ చేస్తూ.. చివరి వరకు తీసుకువచ్చారని తెలిపింది. దీనిపై సింగర్ సునీత కూడా క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా పలుమార్లు విమర్శలు చేయడంతో ఈ వీడియోను షేర్ చేశారు. 

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

Advertisment
Advertisment
Advertisment