IT Notices to Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ (ఐటీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అమరావతి కాంట్రాక్టర్లు అయిన షాపూర్జీ పల్లోంజి (ఎస్పీసీఎల్), ఎల్ అండ్ టీ సమస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు రూ.118 కోట్ల ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను.. ఐటీ శాఖ తిరస్కరించినట్లు తెలుస్తోంది. బోగస్ సభ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారులు అంటున్నారు. By E. Chinni 01 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి IT Notices to TDP Chief Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ (IT) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అమరావతి కాంట్రాక్టర్లు అయిన షాపూర్జీ పల్లోంజి (SPCL), ఎల్ అండ్ టీ (L&T) సమస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు రూ.118 కోట్ల ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను.. ఐటీ శాఖ తిరస్కరించినట్లు తెలుస్తోంది. బోగస్ సభ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారులు అంటున్నారు. మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీ చేయగా.. బటయపడ్డ వ్యవహారం: మనోజ్ వాసుదేవ్ పార్థసాని (Manoj Vasudev Pardasany) నివాసాల్లో తనిఖీల సమయంలో చంద్రబాబు ముడుపుల వ్యవహారం బయటపడినట్లు తెలుస్తోంది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ ఒప్పుకున్నారు. 2016లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా మనోజ్ వాసుదేవ్ టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. శ్రీనివాస్ ద్వారానే సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు అందుకున్నట్టు తెలుస్తోంది. బహిర్గతం కాని రూ.118 కోట్లు: చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగస్టు 4వ తేదీనే సెక్షన్ 153సీ కింద హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం ఈ నోటీసులు జారీ చేసింది. సంస్థల నుంచి వచ్చిన రూ.118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించడం, చట్టం ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను నోటీసుల్లో ప్రస్తావించింది ఐటీ శాఖ. షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీసీఎల్), ఎల్ అండ్ టీ సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు ముట్టాయని.. ఫోనిక్స్ ఇన్ఫ్రా & పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగినట్లు తేలిందంటున్నారు. కాగా పూర్జీ పల్లోంజీ కంపెనీ కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరిల్లో టిడ్కో ఇళ్లు, అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ పనులు చేసింది. అప్పుడే ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని తెలుస్తోంది. ఇవి కూడా చదవండి: మద్యం తాగిన తర్వాత ఈ ఆహార పదార్థాలను తింటున్నారా.. అయితే జాగ్రత్త!! Srisailam: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయల్లో నష్టం Good News for Tenant Farmers: కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం Andhra Pradesh Rain Forecast: ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన.. సెప్టెంబర్ లో భారీ వర్షాలు!! చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు దాడిలో మరో మహిళ మృతి..! #chandrababu-naidu #tdp-chief-chandrababu-naidu #i-t-department-serves-show-cause-notice #it-notices-to-tdp-chief-chandrababu-naidu #income-tax-notice-to-chandrababu-naidu #it-notice-to-chandrababu-naidu #manoj-vasudev-pardasany #shapoorji-pallonji మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి