రాకేశ్ మాస్టర్ మృతికి కారణాలేంటో చెప్పిన డాక్టర్స్..!

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ రక్త విరోచనాలు అవుతున్నాయని గాంధీ ఆస్పత్రిలో చేరగా అప్పటికే ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది, దీంతో తన ఆర్గాన్స్ ఫెయిలయ్యాయని దీంతో ఆయన మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. తన మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

New Update
రాకేశ్ మాస్టర్ మృతికి కారణాలేంటో చెప్పిన డాక్టర్స్..!

it-is-being-spread-that-rakesh-master-died-due-to-drinking-too-much-alcohol

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ అందించారు. టాలీవుడ్ లోని అగ్ర హీరోలందరితో ఆయన స్టెప్పులు వేయించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో లీడింగ్ కొరియోగ్రఫర్ గా ఉన్న శేఖర్ మాస్టర్, రాకేశ్ మాస్టర్ శిష్యుడనే విషయం తెలిసిందే. వారం రోజుల క్రితం తన మిత్రులతో కలిసి వైజాగ్‌‌కు వెళ్లిన ఆయన.. ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు. ఈ టూర్‌లోనే అనారోగ్యానికి గురైన మాస్టర్.. అప్పట్నుంచీ స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇవాళ ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురవ్వడం, ఇంట్లో రక్తవిరోచనాలు చేసుకోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. రాకేశ్ ప్రాణాలను కాపాడటం కోసం వైద్యులు అన్ని విధాలా ప్రయత్నించినా.. అవేమీ ఫలించలేదు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మృతిచెందినట్లు గాంధీ డాక్టర్లు మీడియాకు వెల్లడించారు. రాకేశ్ మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, ఆయన శిష్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కాగా... రాకేశ్ మాస్టర్ మృతిపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కొరియోగ్రఫర్ గా సినీ అవకాశాలు తగ్గడంతో రాకేశ్ మాస్టర్ తాగుడుకు బానిస అయ్యారని, తాగి, తాగి ఆయన కాలేయం, కిడ్నీలు దెబ్బతినడంతో మృతి చెందారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు సన్నిహితంగా ఉండే కొందరు మాత్రం అదేం కాదని, ఎండదెబ్బ తాకి చనిపోయారని చెబుతున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా లక్షలు సంపాదించిన రాకేశ్ మాస్టర్.. చివరికి ఇలా చనిపోవడంతో సినీ లవర్స్, తన అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

ఎలా చనిపోయారు..?

‘రక్త విరోచనాలు అవుతున్నాయని ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రాకేష్ మాస్టర్ గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పటికే ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. డయాబిటిక్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో రాకేశ్ మాస్టర్‌ మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి. ఆయన్ను బతికించాలని డాక్టర్ల చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అయితే సాయంత్రం 5 గంటలకు రాకేశ్ మృతిచెందారు’ అని గాంధీ ఆస్పత్రి సూపరిడెంట్ రాజారావు మీడియాకు వెల్లడించారు. ఇదిలావుంటే.. విజయనగరంలోని ఓ ఫాంహౌస్‌లో ఇటీవలే ఓ సినిమా షూటింగ్ జరిగింది. అయితే.. ఓ సీన్‌లో 20 ఫుల్ మందు బాటిల్స్ తాగారని.. అప్పట్నుంచే రాకేశ్ అస్వస్థతకు గురయ్యారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఎవరీ మాస్టర్..?

ఏపీలోని తిరుపతిలో రాకేశ్ 1968 జన్మించారు. ఆయన అసలు పేరు ఎస్. రామారావు. ముక్కు రాజు మాస్టర్ దగ్గర కొంతకాలం పనిచేసిన ఆయన కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. టాలీవుడ్‌లో ఆయన 1500కు చిత్రాలకు పైగా కొరియోగ్రఫీ అందించారు. శేఖర్‌ మాస్టర్‌, జానీ మాస్టర్‌ లాంటి వారికి శిక్షణను ఇచ్చాడు. ఈ ఇద్దరూ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్నారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘దేవదాసు’, ‘చిరునవ్వుతో’, ‘సీతయ్య’, ‘అమ్మో పోలీసోళ్ళు’ వంటి హిట్‌ చిత్రాలకు రాకేశ్‌ కొరియోగ్రఫీ అందించారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. యూట్యూబ్‌ వేదికగా అనేక వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇచ్చి ట్రెండింగ్‌లో నిలిచారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు