ISRO: 10వ తరగతి అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు.. 50 వేలకు పైనే జీతం.. వివరాలివే..

ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే అప్లికేషన్ ప్రారంభమవగా.. డిసెంబర్ 31 చివరి తేదీ. పూర్తి సమాచారం కోసం https://www.nrsc.gov.in/ పోర్టల్‌ను సందర్శించవచ్చు.

New Update
ISRO Jobs: ఇస్రోలో భారీగా ఉద్యోగాలు..ఎన్నంటే?

ISRO Recruitment 2023: ఇస్రో.. మన దేశానికే గర్వకారణం. యావత్ ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత ఇస్రోదే. భారత అంతరిక్ష సంస్థ చేసిన ప్రయోగాలు అలాంటివి మరి. అందుకే.. ప్రతి ఒక్కరికి ఇస్రో భాగస్వామ్యం అయితే బాగుండు అని ఆశపడుతుంటారు. అయితే, ఇస్రోలో పని చేయాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. తాజాగా ఉద్యోగాల భర్తీకి ఇస్రో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందుకోసం పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు. కేవలం 10వ తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. టెక్నీషియన్-బి ఉద్యోగాల భర్తీకి ఇస్రో నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చునని తెలిపింది. ఇప్పటికే అప్లికేషన్స్ ప్రారంభమవగా.. డిసెంబర్ 31 చివరి తేదీగా ప్రకటించింది. ఇస్రో విడుదల చేసిన పోస్టుల వివరాలు, అర్హతలు, జీతం వంటి వివరాలను తెలుసుకుందాం..

ఇస్రో నోటిఫికేషన్ ప్రకారం పోస్టులు:

టెక్నీషియన్-బి(ఎలక్ట్రానిక్ మెకానిక్) - 33 పోస్టులు
టెక్నీషియన్-బి(ఎలక్ట్రికల్) - 8 పోస్టులు
టెక్నీషియన్-బి(ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్) - 9 పోస్టులు
టెక్నీషియన్-బి(ఫొటోగ్రఫీ)-2 పోస్టులు
టెక్నీషియన్-బి(డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్)-2 పోస్టులు

వయో పరిమితి: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 - 35 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా సామాజిక వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

విద్యార్హతలు:
టెక్నీషియన్-బి(ఎలక్ట్రానిక్ మెకానిక్) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉండాలి. అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(NCVT) నుంచి ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ/ఎన్‌టీసీ/ఎన్‌ఏసీ పూర్తిచేసి ఉండాలి.

టెక్నీషియన్-బి(ఎలక్ట్రికల్) పోస్టులకు కనీసం 10వ తరగతి పాసై ఉండాలి. అలాగే ఎన్‌సీవీటీ నుంచి ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ/ఎన్‌టీసీ/ఎన్‌ఏసీ పూర్తిచేసి ఉండాలి.
టెక్నీషియన్-బి(ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్) ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉండాలి. ఎన్‌సీవీటీ నుంచి ఇన్‌స్ట్రూమెంట్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ/ఎన్‌టీసీ/ఎన్‌ఏసీ అర్హత కలిగి ఉండాలి.

అప్లికేషన్ వివరాలు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి రుసుమూ చెల్లించనక్కర్లేదు.

ఎంపిక విధానం: మొదటి దశలో రాత పరీక్ష, రెండో దశలో స్కిల్ టెస్ట్ ఉంటుంది.

జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెల వేతనం రూ. 21,700 - రూ. 69,100 వరకు ఉంటుంది. అలవెన్సులు అదనంగా వస్తాయి.

ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ అయిన https://www.nrsc.gov.in/ పోర్టల్‌ను సందర్శించవచ్చు.

Notification

Apply Online

Also Read:

మందు బాబులకు షాక్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..!

సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం..

Advertisment
Advertisment
తాజా కథనాలు