Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్‌లో కొనసాగుతున్న మరణ మృదంగం..!! ఇజ్రాయెల్-హమాస్‌లో మరణ మృదంగం కొనసాగుతోంది. రెండు దేశాలు బాంబులు, తుపాకుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటికే 3 వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక భవనాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో ఈ భీకర యుద్ధంలో రెండు వైపుల మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 3 వేలు దాటింది. ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు చేసిన ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. By Jyoshna Sappogula 11 Oct 2023 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్‌లో మరణ మృదంగం కొనసాగుతోంది. రెండు దేశాలు బాంబులు, తుపాకుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటికే 3 వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక భవనాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో ఈ భీకర యుద్ధంలో రెండు వైపుల మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 3 వేలు దాటింది. ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు చేసిన ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ అంతులేని కథలు బయటపడుతున్నాయి. మహిళలు, చిన్నారులు అని చూడకుండా కనిపించిన ప్రతి ఒక్కరిని కాల్చి చంపేస్తు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకున్నారు. The IDF has been warning the world for years about who Hamas is, now everyone can see for themselves.1/3 pic.twitter.com/xAcryz0ecj — Israel Defense Forces (@IDF) October 10, 2023 హమాస్ మిలిటెంట్ల దాడులతో ఎక్కడ చూసినా చెల్లాచెదురైన మృతదేహాలే కనిపిస్తున్నాయి. కాలిపోయిన ఇళ్లు, కార్లలో నుంచి వాటిని ఇజ్రాయెల్ సైనికులు వెలికితీశారు. పిల్లలు, తల్లులు అనే తేడా లేకుండా మృతదేహాలు బయటపడుతున్నాయి. ఉగ్రవాదులు వారిని అతి భయంకరంగా చంపారు. మాటలతో చెప్పలేనంత దారుణంగా ప్రాణాలను బలితీసుకున్నారు. ఇంతటి దారుణానికి తెగబడిన హమాస్‌ను వదిలిపెట్టబోమని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. చిన్నారులతో సహా అమాయక ప్రజలను కాల్చి చంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హమాస్‌ను వెంటాడి, వేటాడి ఈ భూమిపై లేకుండా చేస్తామని హెచ్చరించారు. This is further proof that Hamas is committing war crimes. #HamasWarCrimes #HamasMassacre 3/3 pic.twitter.com/by7K2K2w13 — Israel Defense Forces (@IDF) October 10, 2023 హమాస్ ఉగ్రవాదులు అక్కడి పౌరులపై జరిపిన దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముష్కరులు ఇళ్లల్లోకి చొరబడి పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరిపి అమాయక పౌరులను పొట్టనబెట్టుకుంటున్నారు. క్రూరమైన ఈ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పౌరులను వీధుల్లో పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపారు. పురుగుల్ని నలిపినట్లుగా ఇళ్లల్లోకి చొరబడి ప్రజలను పాయింట్ బ్లాంక్‌లో కాల్చేశారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను బలవంతంగా లాక్కొని వారిని బంధించారు. బందీలుగా ఉన్నవారిలో ఒక్క వృద్ధురాలికైనా, ఒక్క పసికందుకైనా వారు హాని చేస్తే, అది హమాస్ పరిస్థితిని మరింత దిగజారుస్తుందని ఐడీఎప్ హెచ్చరించింది. తాము ఎటువంటి హెచ్చరికలు లేకుండా బాంబింగ్ చేయమని వెల్లడించారు. ఐడీఎఫ్ దాడికి ముందు సోషల్ మీడియాలో పోస్టు చేసి లేదా వార్నింగ్ షాట్స్ పేల్చి హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు. సామాన్య ప్రజలు కూడా ఆ ప్రదేశాల నుంచి వెళ్లిపోవాలని సూచిస్తామని తెలిపింది. "It's not a battlefield. It's a massacre." Here, MG Itai Veruv is preparing journalists to enter Kfar Aza where atrocities have taken place at the hands of Hamas terrorists. pic.twitter.com/1MXMxuWHpA — Israel Defense Forces (@IDF) October 11, 2023 ఇజ్రాయెల్ పై పెద్ద ఎత్తున దాడికి దిగిన హమాస్ మిలిటెంట్లను పోలీసులు ఏరివేస్తున్నారు. సరిహద్దులు దాటి తమ దేశంలోకి చొరబడ్డ టెర్రరిస్టులను కనిపించిన చోటే కాల్చిపడేస్తున్నారు. ఈ క్రమంలో గాజా బార్డర్ లో ఇద్దరు హమాస్ మిలిటెంట్లు పోలీసుల దృష్టిలో పడ్డారు. ఓ కారులో పారిపోతున్న మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు ఛేజ్ చేశారు. ఓ కారులో ఇద్దరు పోలీసులతో పాటు బైక్ పై మరో ఆఫీసర్ వారిని వెంటాడారు. మిలిటెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదనే దృఢ నిశ్చయంతో హైవేపై దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ ఒక చేత్తో బైక్ నడుపుతూనే మరో చేతితో మిలిటెంట్లపై కాల్పులు జరిపాడు. We will continue to defend our nation, our country, our people. Spread the truth, stand with Israel pic.twitter.com/SSSjQM4O90 — Israel Police (@israelpolice) October 10, 2023 భీకర యుద్దం జరుగుతున్న గాజా, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో సామాన్యుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి వాళ్లది.దాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఇరు దేశాల్లో వీధులు రక్తంతో తడిసిపోయాయి. ఎక్కడ చూసిన గుట్టలు గుట్టలుగా పడి ఉన్న మృతదేహాలతో రెండు ప్రాంతాలు భయానకంగా మారిపోయాయి. క్షతగాత్రుల రోదనలతో యుద్ధ ప్రాంతాలు హృదయవిదారకంగా దర్శనమిస్తున్నాయి. Also Read: నగ్నంగా ఊరేగించిన యువతి ఘటనలో అసలు ట్విస్ట్ ఇదే !! #israel-hamas-war #israel-hamas-latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి