ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ రిలీఫ్.... ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేసిన హైకోర్టు....!

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. తోఫాఖానా అవినీతి కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఇస్లామాబాద్ హైకోర్టు కొట్టి వేసింది. ఈ మేరకు తోఫాఖానా కేసులో ఆయనకు విధించిన మూడేండ్ల జైలు శిక్షను హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. హైకోర్టు తీర్పుపై ఆయన మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

New Update

తోఫాఖానా కేసులో ట్రయల్ కోర్టు ఇమ్రాన్ ఖాన్ ను దోషిగా నిర్దారించింది. ఈ కేసులో ఆయనకు మూడేండ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల5న ట్రయల్ కోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ సవాల్ చేశారు. ఆ పిటిషన్ పై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇమ్రాన్ ఖాన్ తరఫఉన ప్రముఖ న్యాయవాది లతీఫ్ ఖోసా వాదనలు వినిపించారు.

ఈ కేసులో కోర్టు తొందరపాటులో తీర్పు వెల్లడించిందని లతీఫ్ అన్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో కొన్ని లోపాలు ఉన్నాయని ఆయన వివరించారు. అందువల్ల ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన బెట్టాలని హైకోర్టును ఆయన కోరారు. ఈ కేసులో తమ వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలనిఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కోరారు.

కానీ శుక్రవారం ఎన్నికల సంఘం తరఫు న్యాయవాద గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాల వల్ల తాను కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని ధర్మాసనానికి ఆయన తెలిపారు. దీంతో ఈ కేసులో విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో సోమవారం వాదనలు విన్న ధర్మాసనం తీర్పును మంగళవారానికి రిజర్వు చేసింది. తాజాగా ఈ రోజు విచారణ చేపట్టిన ధర్మాసనం ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది.

నెయ్యితో చేసిన దేశీ చికెన్, మటన్, ఎయిర్ కూలర్…అదృష్టం అంటే నీదే సామి..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Earthquake: మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

New Update
7.1 earthquake hits Tonga in South Pacific

Earthquake

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ భూ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. హిందూకుష్ ప్రాంతంతో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

Advertisment
Advertisment
Advertisment