Pak: ప్రధాని అంటే అట్లుంటది మరి..ఏకంగా విమానం దారి మళ్లింపు.! పాక్ ప్రధానమంత్రి, ఆయన ప్రతినిధులు దిగేందుకు విమానాన్ని దారి మళ్లించారు. దీంతో వందలమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధాని దిగడం కోసం ఇస్లామాబాద్ వెళ్లాల్సిన విమానాన్ని లాహోర్ వైపు దారి మళ్లించినట్లు పాక్ మీడియా కథనాలు తెలిపాయి. By Bhoomi 10 Apr 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Pak: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే షహబాజ్ షరీఫ్ కొత్త సర్కార్ కొలువైంది. ఈ క్రమంలోనే ప్రజా సేవలకు విఘాతం కలగకుండా ఉండేందుకు తమ ప్రభుత్వంలో వీఐపీ కల్చర్ ను తొలగిస్తున్నట్లు స్వయంగా ప్రధాని ప్రకటించారు. అధికారిక కార్యకలాపాల్లో ఎర్ర తీవాచీల వినియోగంపై నిషేధం విధించారు. అయితే ఇప్పుడు ఆయన విషయంలోనే వీఐపీ సంస్క్రుతిను పాటించడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని దిగడం కోసం విమానాన్ని దారి మళ్లించడంతో వందల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాక్ ప్రభుత్వం..ఖర్చులను తగ్గించుకోవడం పై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే ప్రధాని కూడా సామాన్య ప్రయాణికుల వలే విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ మధ్యే షహబాజ్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఆయన వెంట ఉన్నతస్థాయి ప్రతినిధులు కూడా ఉన్నారు. వీరు పర్యటన ముగించుకుని తిరిగివస్తుండగా..ప్రధాని దిగడం కోసం ఇస్లామాబాద్ వెళ్లాల్సిన విమానాన్ని లాహోర్ వైపు దారి మళ్లించినట్లు ఆ దేశ మీడియా కథనాలను వెల్లడించాయి. జెడ్డా నుంచి ఇస్లామాబాద్ వెళ్లే పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రధాని, ఆయన బ్రుందం ప్రయాణించింది. వీరితోపాటు విమానంలో మొత్తం 393 మంది ప్రయాణికులు ఉన్నారు. వాస్తవానికి ఈ విమానం సోమవారం రాత్రి 10.30గంటలకు ఇస్తామాబాద్ లో దిగాల్సింది. అయితే దాన్ని దారి మళ్లించడంతో రాత్రి 9.25 గంటలకే విమానం లాహోర్ ఎయిర్ పోర్టులో దిగింది. దీంతో ప్రధాని సహా 79మంది అక్కడే దిగారు. విమానం ఆలస్యమవ్వడంతో ఇస్లామాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ చేసేదేం లేక..అందులోనే ఉండాల్సి వచ్చింది. అనంతరం రాత్రి 11.17 గంటలకు విమానం అసలైన గమ్యస్థానానికి చేరింది. ఇది కూడా చదవండి: రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.! #pakistan-pm-shehbaz-sharif #pakostan #islamabad-bound #inconveniencing-other-passengers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి