ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగటం చాలా డేంజర్! By Durga Rao 02 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి టీ లేదా కాఫీ.. ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. దీని పేరు చెప్తే చాలు.. చాలా మందికి ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. టైం తో సంబంధం లేకుండా.. చాలా మంది వీటిని తీసుకుంటారు. అంతే కాకుండా.. కొంచెం అలసటగా ఉన్నా.. తలనొప్పి వచ్చినా.. నలుగురు కలిసినా.. కప్పు టీ లేదా కాఫీ గొంతు జారాల్సిందే. అయితే.. ఉదయాన్నే వీటిని తీసుకోవడంపై హెచ్చరిక చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం ప్రమాదకరమని చెబుతున్నారు. ఉదయం లేవగానే పరగడపున టీ తాగేముందు ఓ చిన్న పని చేయాలని సూచిస్తున్నారు. మరి, అదేంటో ఇప్పుడు చూద్దాం. రాత్రి నుంచి ఏమీ తినకుండా.. ఉదయాన్నే వేరే ఏదీ తీసుకోకుండా.. టీ లేదా కాఫీ తాగడం వల్ల.. పేగులపై ప్రభావం పడుతుంది. దీనివల్ల ఆకలి తగ్గిపోవడంతోపాటు.. జీర్ణ క్రియ కూడా నెమ్మదిగా మారుతుంది. టీ లేదా కాఫీని పరగడుపున తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ (gas) సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చస్తున్నారు. ఖాళీ కడుపుతో కాఫీ,టీని తాగడం వల్ల మానసిక ఆందోళనకు దారి తీసే అవకాశం వుంటుంది.కాఫీలోని ఆమ్లత్వం వల్ల ఖాళీ కడుపుతో సేవించినప్పుడు, అది కడుపులోని ఎసిడిటీ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.కాఫీలో టానిన్లు ఇనుము, కాల్షియంతో సహా కొన్ని పోషకాలను గ్రహించడం వల్ల సమస్యలు వస్తాయి.కెఫిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీ, గ్లూకోజ్ జీవక్రియను ప్రభావితం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. #best-health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి