Life Insurance: జస్ట్ 35 పైసలతో రూ. 10 లక్షల బీమా.. ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోండి.. రైలు ప్రయాణం బాగానే ఉంటుంది. కానీ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే? ఆ వ్యక్తినే నమ్మకుని ఉన్న కుటుంబం పరిస్థితి ఏంటి? రైలులో అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే.. ప్రయాణ బీమాను పొందవచ్చు. దీని ద్వారా ప్రయాణంలో ఆర్థిక భద్రతను పొందుతారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుకింగ్ యాప్ IRCTC ద్వారా రైటు టిక్కెట్‌లు బుక్ చేసుకుంటే డీఫాల్ట్‌గా రూ. 35 పెసలు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని చెల్లించడం ద్వారా రూ. 10 లక్షల బీమా పొందుతారు. By Shiva.K 04 Oct 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి IRCTC Travel Insurance Policy: రైలులో ప్రయాణించాలని అనుకున్నప్పుడల్లా.. మనసులో మొదటగా వచ్చే ఆలోచన ఆర్థిక భద్రత. ట్రైన్ ప్రయాణం సురక్షితం అనే నమ్మకంతో పాటు.. సౌకర్యవంతంగా, చార్జీలు కూడా తక్కువగా ఉంటాయి. అందుకే చాలా మంది ప్రజలు రైలు ప్రయాణాన్ని ఇష్టపడుతుంటారు. అయితే, రైలు ప్రయాణం బాగానే ఉంటుంది. కానీ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే? ఆ వ్యక్తినే నమ్మకుని ఉన్న కుటుంబం పరిస్థితి ఏంటి? రైలులో అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే.. ప్రయాణ బీమాను పొందవచ్చు. దీని ద్వారా ప్రయాణంలో ఆర్థిక భద్రతను పొందుతారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుకింగ్ యాప్ IRCTC ద్వారా రైటు టిక్కెట్‌లు బుక్ చేసుకుంటే డీఫాల్ట్‌గా రూ. 35 పెసలు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని చెల్లించడం ద్వారా రూ. 10 లక్షల బీమా పొందుతారు. మరి ప్రయాణ బీమా ఆప్షన్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి. బీమా క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుంది? కీలక వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 35 పైసలకు రూ.10 లక్షల ప్రయాణ బీమా.. వాస్తవానికి, IRCTC నుండి రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో ప్రయాణీకులు 35 పైసల ప్రీమియం చెల్లించి డిఫాల్ట్ బీమాను పొందే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకోకూడదనుకుంటే 'నో' ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. లేదంటే.. టికెట్ బుక్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఇన్సూరెన్స్ ఆప్షన్ వస్తుంది. బీమా ఎంపికను ఎంచుకుని, ప్రయాణంలో అనుకోని ప్రమాదం జరిగితే, మీకు ప్రయాణ బీమా ఇవ్వడం జరుగుతుంది. అయితే, బీమా క్లెయిమ్ ప్రయోజనం పొందే విధానం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. బీమా క్లెయిమ్ కింద నామినీ వివరాలను పూరించాలి.. IRCTC టిక్కెట్ బుకింగ్ తర్వాత ప్రతి ప్రయాణీకుడికి మెసేజ్, మెయిల్ వస్తుంది. ఈ మెసేజ్‌లో ప్రయాణీకుడు బీమా పాలసీ కింద నామినీ వివరాలను పూరించే లింక్ ఉంటుంది. ఇందులో మీ కుటుంబ సభ్యుల పేరు, వారి మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, ఇమెయిల్, సంబంధాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది. నామినీ వివరాలను నమోదు చేసిన తరువాత మాత్రమే ప్రయాణ బీమా క్లెయిమ్ చేయవచ్చు. నామినీ వివరాలను పూరించని వారు, వారి కుటుంబ సభ్యులు బీమా క్లెయిమ్ చేయడానికి కొన్ని పత్రాలతో పాటు వివిధ చట్టపరమైన ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. బీమా పాలసీ కోసం కంపెనీలతో IRCTC ఒప్పందం.. IRCTC బీమా సౌకర్యాలను అందించడానికి లిబర్టీ ఇన్సూరెన్స్, SBI జనరల్ ఇన్సూరెన్స్ తో జతకట్టింది. 35 పైసలకు, ఈ కంపెనీలు ప్రయాణ సమయంలో ప్రయాణికుడు మరణిస్తే రూ. 10 లక్షల బీమా క్లెయిమ్ సౌకర్యాన్ని అందిస్తాయి. అదే సమయంలో శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు, అంగవైకల్యం ఏర్పడితే రూ.2 లక్షల ప్రయాణ బీమా కవరేజీ లభిస్తుంది. Also Read: Central Cabinet Decisions: తెలంగాణపై కేంద్రం వరాల జల్లు.. ఎట్టకేలకు కృష్ణా జలాలపై స్పందన.. Chandrababu case: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు?? కొద్ది గంటల్లో ఏం జరగబోతోంది? #indian-railways #irctc-travel-insurance #travel-insurance-policy #10-lakh-insurance మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి