IRCTC Ticket Fraud: రైలు టికెట్ బుకింగ్ పేరుతో ఘరానా మోసం!

New Update
IRCTC Ticket Fraud: రైలు టికెట్ బుకింగ్ పేరుతో ఘరానా మోసం!

IRCTC Ticket Fraud: మీరు IRCTC ద్వారా రైలు టిక్కెట్లను బుక్ చేస్తున్నట్లయితే, కొన్ని విషయాల తప్పక తెలుసుకోవాలి. నిజానికి రైలు టికెట్ బుకింగ్ చేసాక చాలా మంది బ్యాంకు ఖాతాల నుండి డబ్బులు కట్ అయ్యి వారికి టికెట్ బుకింగ్ కూడా అవ్వటం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఇప్పుడు తెలుసుకుందాం.

వాట్సాప్ నుండి మోసం-
వాట్సాప్ ద్వారా కూడా ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ రోజుల్లో ఒక మెసేజ్ ఎక్కువగా వైరల్ అవుతోంది. మోసగాళ్లు ఈ మెసేజ్ ను వాట్సాప్ ద్వారా మీ ఫోన్ కి పంపించి లింక్ లో నుండి టికెట్ బుక్ చేసుకోమని కోరుతారు. IRCTC కి బదులుగా కొత్త వెబ్‌సైట్ వచ్చిందని, మీరు ఇక్కడ నుండి రైలు టిక్కెట్ బుకింగ్‌ను పొందుతారు అని చెప్తారు, కానీ ఆలా జరగదు.

నకిలీ సైట్లు-
ఐఆర్‌సీటీసీ, రైలు టికెట్ బుకింగ్ పేరుతో అనేక నకిలీ సైట్లు కూడా ఉన్నాయి. ప్రజలు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ సైట్ల సాయంతో రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని నేరగాళ్లునమ్మిస్తారు. చాలా సార్లు అందుబాటులో లేని సీట్లు కూడా ఇక్కడ ఖాళీగా ఉన్నట్లు చూపిస్తారు. మొదట మీరు నిజమైన మరియు నకిలీ సైట్ గురించి తెలుసుకోవాలి. అయితే అలాంటి సైట్లపై గూగుల్ చర్యలు తీసుకుంటోంది. కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.

Also Read: ‘మైక్రోసాఫ్ట్’ క్రాష్​.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన బ్యాంకింగ్, విమాన సేవలు!

ఎలా రక్షించాలి -
మీరు ఏ తప్పు చేయకుండా నకిలీ సైట్లను గుర్తించి అప్రమత్తంగా ఉండాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు