Breaking : ఇరాన్ అధ్యక్షుడు మృతి!

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు ధృవీకరించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయి 20 గంటలకు పైగా గడిచింది. సోమవారం ఉదయం హెలికాఫ్టర్ కూలిపోయిన ప్రదేశాన్ని మాత్రం అధికారులు గుర్తించారు.

New Update
Breaking : ఇరాన్ అధ్యక్షుడు మృతి!

Iran President Died : ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కూలిపోయింది (Helicopter Accident). సుమారు 17 గంటలు గడిచిన తరువాత హెలికాప్టర్‌ శిథిలాలు దొరికినట్లు అధికారులు వివరించారు. సహాయక బృందం ప్రమాద స్థలానికి చేరుకుందని అధికారులు వివరించారు. పలు ఇరాన్ మీడియా ఛానెల్‌లు రైసీ హెలికాప్టర్ శకలాలను రెస్క్యూ టీమ్‌లు (Rescue Teams) కనుగొన్నాయని తెలిపాయి. అయితే, అధ్యక్షుడు, అతని సహచరులు ప్రాణాలతో బయటపడ్డారా లేదా అనే దాని మీద రెడ్ క్రెసెంట్ సమాచారం అందించలేదు. మరో ఇరానీ మీడియా ప్రమాద స్థలంలో ఎవరూ సజీవంగా ఉన్నట్లు ఎటువంటి సంకేతాలు కనుగొనబడలేదని తేల్చింది.

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు హెలికాప్టర్‌లో విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలెక్ రహ్మతి, తబ్రిజ్ రాయల్ ఇమామ్ మొహమ్మద్ అలీ అల్హాషెమ్, ఒక పైలట్, సెక్యూరిటీ చీఫ్ , ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారని ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ వివరించింది. ప్రమాదం గురించి తదుపరి సమాచారం అందుబాటులో లేదు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు, ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్ కూడా కాన్వాయ్ హెలికాప్టర్‌లో ఉన్నారు.

ఇరాన్ అధ్యక్షుడి కాన్వాయ్‌లో మూడు హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో రెండు హెలికాప్టర్లు వారి గమ్యస్థానంలో సురక్షితంగా ల్యాండ్ చేయబడ్డాయి. పైలట్ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదానికి దారితీసింది. సహాయక చర్యల కోసం 16 బృందాలను రంగంలోకి దించారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63 ఏళ్లు) తూర్పు అజర్‌బైజాన్‌కు వెళ్తున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజర్‌బైజాన్ సరిహద్దు నగరం జోల్ఫా సమీపంలో ప్రమాదం జరిగింది.

ఆదివారం తెల్లవారుజామున అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి ఆనకట్టను ఆయన ప్రారంభించాల్సి ఉంది. అరస్ నదిపై ఇరు దేశాలు నిర్మించిన మూడో డ్యామ్ ఇది. అధ్యక్షుడి కాన్వాయ్‌లో తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ కూడా ఉన్నారు.

Also Read : ఎవరీ ఇబ్రహీం రైసీ? ఆయన్ను ఇరాన్‌లోని ఓ వర్గం ఎందుకు వ్యతిరేకిస్తుంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు