/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ipl-stokes-jpg.webp)
ఐపీఎల్(IPL) రిటెన్షన్ డెడ్‌లైన్ ముగిసింది. ఆయా ఫ్రాంచైజీలు తమ జట్లలోని పలువురు ఆటగాళ్లను రిలీజ్ చేశాయి. కొందరిని ఉంచుకున్నాయి. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టైన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి కప్ కొట్టేందుకు ప్లాన్లు రచిస్తోంది. డిసెంబర్ 19న జరగనున్న ఆక్షన్‌పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే పలువురు ఆటగాళ్లను వేలానికి రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ గెలుచుకున్నది చెన్నై సూపర్ కింగ్సే. అది వారికి 5వ ఐపీఎల్ ట్రోఫీ. ఇక వచ్చే ఏడాది కూడా తమ సత్తా ఏంటోచూపించాలని భావిస్తున్న చెన్నై మొత్తం 8మంది ఆటగాళ్లను వదులకుంది.
Retained and released players list of CSK ahead of IPL auction.#IPL2024 | #IPLAuction | #IPLretention pic.twitter.com/ZZhZ1kUlB7
— Haroon 🏏🌠 (@Haroon_HMM) November 26, 2023
పర్సులో రూ.32 కోట్లు:
ఈ ఏడాది వేలానికి ముందు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(Ben Stokes)ను చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) రూ. 16.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది స్టోక్స్ పెద్దగా ఆడింది లేదు. దీంతో అతడిని వేలానికి రిలీజ్ చేసింది. ఇక స్టోక్స్ కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా జిడ్డు బ్యాటింగ్ చేస్తున్నాడు. టెస్టు ప్లేయర్‌గానూ ముద్రపడిపోయాడు. అటు స్టోక్స్‌తో పాటు ఏపీ పాలిటిక్స్‌లో బిజీబిజీగా ఉంటున్న అంబటిరాయుడును కూడా చెన్నై వేలానికి రిలీజ్ చేసింది. నిజానికి గతేడాదే రాయుడు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలనుకున్నాడు కానీ చెన్నై మేనేజ్‌మెంట్ రిక్వెస్ట్ చేయడంతో ఈ ఏడాది కూడా కంటీన్యూ చేశాడు. అటు కైల్ జేమిసన్‌ను కూడా వేలానికి రిలీజ్ చేసింది చెన్నై.
ఇతర వివరాలు:
చెన్నై పర్స్‌లో మిగిలినవి - రూ. 32.2 కోట్లు
విడుదలైన ఆటగాళ్లు - 8
మిగిలి ఉన్న ప్లేయర్ల స్లాట్లు - 6 (3 ఓవర్సీస్)
చెన్నై విడుదల చేసిన ఆటగాళ్లు:
బెన్ స్టోక్స్
డ్వైన్ ప్రిటోరియస్
అంబటి రాయుడు
కైల్ జేమిసన్
సిసంద మగల
ఆకాష్ సింగ్
భగత్ వర్మ
సుభ్రాంశు సేనాపతి
Also Read: కోచ్‌గా లక్ష్మణ్ వద్దంటున్న ఫ్యాన్స్.. ఇదేం లాజిక్ భయ్యా!
WATCH: