IPL 2024, MS Dhoni : ఈ సీజన్ లో ఫస్ట్ టైం ఇలా రనౌట్ అయిన ధోని!

చేపాక్ మైదానం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ సీజన్ లో తొలిసారి ధోని ఇలా అవుట్ అవటం అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది.అదేంటో చూసేద్దాం రండి!

New Update
IPL 2024, MS Dhoni : ఈ సీజన్ లో ఫస్ట్ టైం ఇలా రనౌట్ అయిన ధోని!

ధోని వయసు ప్రస్తుతం 42. వయసు అనేది అతడికి జస్ట్ నెంబర్ మాత్రమే. ఇప్పటికీ అదే వేగంతో కీపింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్లో అదరగొడుతున్నాడు. వికెట్ల మధ్యలో చిరుతపులి లాగా పరిగెడుతున్నాడు. జులపాల జుట్టుతో వింటేజ్ ధోని లాగా దర్శనమిస్తున్నాడు. చివర్లో వచ్చి ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడుతున్నాడు.. అయితే అలాంటి ధోని బుధవారం రాత్రి పంజాబ్ జట్టుతో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో రాణించలేకపోయాడు. అంతేకాదు ఈ సీజన్ లో తొలిసారి అవుట్ అయ్యాడు.

చేపాక్ మైదానం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు పంజాబ్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి పంజాబ్ జట్టుది. ఈ మ్యాచ్ అనుక్షణం ఉత్కంఠ గా సాగింది.. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయంలో పంజాబ్ జట్టు వీరోచితంగా పోరాడింది. 13 బంతులు ఉండగానే ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఈ విజయంతో ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరచుకుంది. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి, 20 ఓవర్లలో 162 రన్స్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో 163 రన్స్ చేసి గెలుపు అందుకుంది.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై జట్టు తరఫున ఆడుతున్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పటివరకు పెవిలియన్ చేరుకోలేదు. అయితే బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు చేతిలో అవుట్ అయ్యాడు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయిన తర్వాత.. 18 ఓవర్లో ధోని బ్యాటింగ్ కు వచ్చాడు. 11 బంతుల్లో 14 రన్స్ చేశాడు. ఇందులో ఒక ఫోర్, ఒక సిక్స్ ఉంది. చివరి బంతికి రెండు రన్స్ తీసే క్రమంలో రన్ అవుట్ అయ్యాడు.. ఈ సీజన్లో 9 మ్యాచ్లలో ధోని తనను అవుట్ చేసే అవకాశం బౌలర్లకు ఇవ్వలేదు. చాలా మ్యాచులలో లాస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన ధోని.. పరుగుల వరద పారించాడు. అలా ఇప్పటివరకు అతడు 110 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లలో 10 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. ధోని 229 స్ట్రైక్ రేట్, 110 సగటుతో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో అత్యధిక సగటు విభాగంలో ధోని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు