Homeopathy : జబ్బును కూకటివేళ్లతో పెకళించడం.. వరల్డ్ హోమియోపతి డే!

హోమియోపతి వైద్య పద్ధతికి 200 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అనేక రకాల వ్యాధుల చికిత్సలో హోమియోపతిని ఉపయోగిస్తారు. అయితే హోమియోపతి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Homeopathy : జబ్బును కూకటివేళ్లతో పెకళించడం.. వరల్డ్ హోమియోపతి డే!

Homeopathy Treatment : హోమియోపతి(Homeopathy) వైద్య పద్ధతికి 200 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అనేక రకాల వ్యాధుల చికిత్సలో హోమియోపతిని ఉపయోగిస్తున్నారు. ఈ చికిత్స 1700ల చివరలో జర్మనీ(Germany) లో అభివృద్ధి చేశారు. అనేక యూరోపియన్ దేశాలతో పాటు భారత్‌(India) లో ఎక్కువగా హోమియోపతిని ఆరోగ్య ప్రయోజనాల(Health Benefits) కోసం వాడుతున్నారు. హోమియోపతి వ్యవస్థాపకుడు డాక్టర్ శామ్యూల్ హానెమాన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటారు . హోమియోపతి వైద్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం దీని లక్ష్యం. అలర్జీలు, మైగ్రేన్, డిప్రెషన్, క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పేగు వ్యాధి లాంటి సమస్యలలో హోమియోపతిని ఉపయోగిస్తున్నారు.

publive-image

శరీరం సహజ రక్షణ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా వ్యాధులకు చికిత్స చేయడమే హోమియోపతి వెనుక ఉన్న ప్రాథమిక భావన. అంటే ముల్లును ముల్లుతోనే తీయాలి అనే పద్ధతి ఇది. ఏ రోగకారక క్రిమి.. జబ్బుకు కారణమౌతుందో, అదే క్రిమితోనే జబ్బును నయం చేయడమన్నమాట. అంటే జబ్బును కూకటివేళ్లతో పెకళించడం ఈ పద్ధితి ప్రధాన లక్ష్యం. ఈ వైద్య విధానంలో చాలామందికి అపోహలున్నాయి. హోమియోపతి వైద్యం చాలా నిదానంగా పనిచేస్తుందని చెప్పే వారి సంఖ్య కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదంటారు హోమియోపతి వైద్యులు.ఇతర వైద్యానికి ఏ లొంగని జబ్బులున్న.. చివరిగా హోమియోపతి వైద్యుల వద్దకు రోగులను తీసుకొస్తుంటారని అంటున్నారు నిపుణులు.

publive-image

హోమియోపతికి భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. భారత్‌లో 10 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హోమియోపతిని ఉపయోగిస్తున్నారని అంచనా. దేశంలో 2 లక్షల కంటే ఎక్కువ నమోదిత హోమియోపతి వైద్యులు ఉన్నారు. 7,000 కంటే ఎక్కువ హోమియోపతిక్ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు ఉన్నాయి. ప్రభుత్వాలు స్వయంగా హోమియోపతి ఆసుపత్రులను నడుపుతున్నాయి. ఇక హోమియోపతి కోసం భారత్‌లో 180 వైద్యకళాశాలలు, 40 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వైద్య కాలేజీలున్నాయి. అమెరికా, జర్మనీ, రష్యా లాంటి దాదాపు 158 దేశాలలో హోమియో వైద్యం అధికారికంగా సేవలందిస్తున్నది.

Also Read: Neck Pain: మెడ నొప్పి ఉందా..? ఇలా చేస్తే ఆపరేషన్ కూడా అవసరం లేదు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు