OPERATION HORMUZ : హార్మూజ్ కింగ్ మేకర్ ఎవరు..?

Strait of Hormuz.. ఇది కేవలం ఒక సముద్ర మార్గం కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే గుండె చప్పుడు. ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండానే రవాణా జరుగుతుంది. అలాంటి ఈ రూట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటే… వాళ్లే king maker.

New Update
_Strait of Hormuz

Strait of Hormuz.

OPERATION HORMUZ :  Strait of Hormuz.. ఇది కేవలం ఒక సముద్ర మార్గం కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే గుండె చప్పుడు. ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండానే రవాణా జరుగుతుంది. అలాంటి ఈ రూట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటే… వాళ్లే king maker. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ మొత్తం వాళ్ల చేతిలోనే ఉంటుంది. అందుకే ఇప్పటికే ఇరాన్ కంట్రోల్‌లో ఉన్న హార్మోజ్‌ను ట్రంప్‌ పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు.  

యుద్ధం గెలవాలంటే కేవలం మిలిటరీ పవర్‌ ఉంటే సరిపోదు..మనీ కూడా కావాలి. పర్షియన్ కంట్రీ అయిన ఇరాన్‌ ఆయిల్ EXPORTSపైనే ఆధారపడుతుంది. ఆ చమురు ఎగుమతి అయ్యేది హోర్ముజ్ గుండానే.
కాబట్టి ఈ రూట్‌ను బ్లాక్ చేస్తే..ఇరాన్‌ ఆర్థికంగా నష్టపోతుంది.. ఆదాయం లేకుండా యుద్ధాన్నికొనసాగించలేదు..ఇదే స్ట్రాటజీతో ట్రంప్‌ హార్మూజ్‌ని  TAKE OVER చేసుకోవాలని అనుకుంటున్నాడు.

తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంటే చూస్తూ ఖాళీగా కూర్చోమని USకు ఇరాన్ కౌంటరిస్తోంది. హార్మూజ్ గుండా కొన్ని దేశాల షిప్స్‌కు మాత్రమే పర్మిషన్ ఇస్తూ.. మరికొన్నింటికి భారీ టోల్ వసూలు చేస్తోంది. ఒక్కో షిప్‌కు మిలియన్ డాలర్ల వరకు వసూలు చేస్తున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా US, Israelకు చెందిన షిప్స్ వస్తే మైన్స్‌ పేల్చేస్తామని వార్నింగ్ ఇస్తోంది.

ఇక్కడే అమెరికా ఇంకో ప్లాన్‌ వేసింది. హార్మోజ్‌ని కంట్రోల్‌లోకి తీసుకోవాలని చూస్తుంది. హార్మూజ్‌ను స్వాధీనం చేసుకోవాలని US నేవీకి ట్రంప్ ఆదేశించారు. హార్మూజ్‌లోకి వచ్చే, బయటకు వెళ్లే నౌకలపై చెకింగ్ చేయాలన్నారు. ఇరాన్ పోర్టులకు వెళ్లే నౌకలను అడ్డుకొని, సీజ్ చేయాలని ఆదేశించారు. ఇండియన్ టైం ప్రకారం ఏప్రిల్ 13న సాయంత్రం 7.30వరకు ట్రంప్ డెడ్‌లైన్ విధించారు 

అమెరికా చర్యలపై ఇరాన్ చాలా కూల్‌గా, స్ట్రాటజిక్‌గా రియాక్ట్‌ అవుతోంది.
హార్మూజ్‌ను బ్లాక్‌ చేస్తే ఇరాన్‌ కంటే మిగతా దేశాలకే నష్టం ఎక్కువని అంటోంది. చమురు ధరలు ఇప్పుడున్న దానికంటే డబుల్‌ అవుతాయని ఇరాన్‌ పార్లమెంటరీ స్పీకర్‌ గాలిబాఫ్‌ ట్వీట్ చేశారు.

ఇప్పుడు ఇదే ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఓ వైపు ఇరాన్, మరోవైపు అమెరికా..వాళ్ల చెకింగ్ ప్రాసెస్ వల్ల SUPPLY DELAY అవుతుంది. ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు ఎక్కువై..చమురు ధరలు పెరుగుతాయి. హార్మూజ్‌ పూర్తిగా క్లోజ్ అవ్వకపోయినా.. వరల్డ్‌ మార్కెట్‌ను షేక్ చేస్తుంది.
ఇప్పటికే ధరలు 70డాలర్ల నుంచి వంద డాలర్లను దాటాయి. ఫ్యూయల్ ధరలు పెరిగితే ఆందోళనలు మొదలవుతాయి. 

ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఎంటంటే.. హార్మూజ్‌ను పూర్తిగా కంట్రోల్ చేయడమనేది అమెరికాకు అంతా easy కాదు. ఎందుకంటే ఇది చిన్న రూట్ కాదు.. ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది. అలాగే దీనిపై 
US, ఇరాన్‌ మాత్రమే కాకుండా.. చైనా, ఇండియా, యూరప్, గల్ఫ్‌ దేశాలు కూడా ఆధారపడ్డాయి. సో ఇక్కడ ఏ చిన్న టెన్షన్ జరిగినా.. మిలటరీ యాక్షన్ జరిగినా అది US vs Iranగానే ఆగిపోదు.. global issueగా మారుతుంది. 

మొత్తానికి ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలని ట్రంప్ చూస్తుంటే… ఎనర్జీ క్రైసిస్‌తో ప్రపంచంపై ఒత్తిడి తీసుకురావాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది. ఇందులో ఎవరు గెలుస్తారనేది రాబోయే రోజుల్లో తెలుస్తోంది. కానీ వారి చర్యల వల్ల వరల్డ్‌ ఎకానమీ మాత్రం కుదేలాయ్యేలా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు