Helle Lyng : మోదీని టార్గెట్ చేయబోయి ఇరుక్కున్న జర్నలిస్టు..  ఎవరీ హెలె లింగ్?

నార్వే రాజధాని ఓస్లోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ వేదికపై ఒక హైడ్రామా చోటుచేసుకుంది. నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌తో కలిసి పీఎం మోదీ నిర్వహించిన

New Update
pm modi

నార్వే రాజధాని ఓస్లోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ వేదికపై ఒక హైడ్రామా చోటుచేసుకుంది. నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌తో కలిసి పీఎం మోదీ నిర్వహించిన సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్‌లో.. ఒక నార్వేజియన్ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న, ఆమె ప్రవర్తించిన తీరు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర వివాదానికి దారితీసింది. పశ్చిమ దేశాల మీడియాకు భారత్‌పై ఉన్న వ్యతిరేక జెండాకు ఇది మరో ఉదాహరణ అంటూ భారత విదేశాంగ శాఖతో పాటు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నార్వేకు చెందిన దగ్‌సావిసెన్ అనే చిన్న పత్రికలో పనిచేసే జర్నలిస్ట్ హేలే లింగ్, ప్రెస్ బ్రిఫింగ్ సందర్భంగా పీఎం మోదీని మానవ హక్కుల అంశంపై ఒక ప్రశ్న అడిగారు. అయితే, ఆమె ప్రశ్న అడిగిన తీరు, ఉపయోగించిన లహరి అత్యంత ఘాటుగా, అగౌరవంగా ఉండటంతో భారత ప్రతినిధి బృందం, ఇండియా మీడియా ప్రతినిధులు అక్కడికక్కడే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విదేశాంగ శాఖ అధికారులతో ప్రెస్ రూమ్‌లోనే తీఖ్నమైన వాదోపవాదాలు జరిగాయి. ఈ క్రమంలో సదరు జర్నలిస్ట్ కోపంతో ప్రెస్ రూమ్ నుండి బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ లోపలికి వచ్చారు.

ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో భారతీయుల నుండి తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ఎదురవడంతో హేలే లింగ్ తన ఎక్స్ ఖాతాలో సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. నేనేమీ విదేశీ ప్రభుత్వానికి లొంగిపోయిన గూఢచారిని కాను, నా పని కేవలం జర్నలిజం మాత్రమే. జర్నలిజంలో కొన్నిసార్లు ఘర్షణ వాతావరణం సహజం. పాలకులు ఇచ్చే ముందస్తు సమాధానాలతో సరిపెట్టుకోకుండా, స్పష్టమైన నిజాలు రాబట్టడమే జర్నలిస్టుల బాధ్యత అంటూ సమర్థించుకున్నారు. అంతటితో ఆగకుండా, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో నార్వే మొదటి స్థానంలో ఉంటే, భారత్ 157వ స్థానంలో ఉందంటూ విమర్శలు గుప్పించారు.

సిబి జార్జ్ గట్టి కౌంటర్

నార్వే వేదికగా భారత్‌పై జరిగిన ఈ దుష్ప్రచారానికి జపాన్‌లో భారత రాయబారి సిబి జార్జ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను సమర్థిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. "భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. అయినప్పటికీ ప్రపంచ సమస్యల్లో భారత్ వాటా చాలా తక్కువ. భారత రాజ్యాంగం పౌరులందరికీ ప్రాథమిక హక్కులను గ్యారెంటీ ఇస్తుంది. పాశ్చాత్య దేశాల కంటే ముందే భారతదేశంలో మహిళలకు ఓటు హక్కు లభించింది. కొందరికి భారత్ యొక్క విస్తృతి, వైవిధ్యం, ఇక్కడి మీడియా స్వేచ్ఛ అర్థం కాదు. ఒక్క ఢిల్లీలోనే వివిధ భాషల్లో ప్రసారమయ్యే దాదాపు 200 టీవీ ఛానళ్లు ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని  సీబీ జార్జ్ భారత రామబారి తెలిపారు. 

ఈ ఘటనతో అంతర్జాతీయ వేదికలపై పశ్చిమ దేశాల మీడియా ఇండియా పట్ల అనుసరిస్తున్న పక్షపాత వైఖరిపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు తెరలేచింది. 

Advertisment
తాజా కథనాలు