US: భారతీయులకు అలర్ట్...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్! అమెరికాలో అడుగుపెట్టడం అంత సులభం కాదు. వీసా పొందడానికి సవాలక్ష నిబంధనలు, ఫార్మాలిటీస్‌ను పూర్తిచేయాలి.ఇక, మళ్లీ ట్రంప్ అధికారంలోకి రావడంతో హెచ్1బీ వీసాలపై దృష్టి పెడతారనిపిస్తుంది. By Bhavana 05 Dec 2024 | నవీకరించబడింది పై 09 Dec 2024 08:23 IST in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి America: అటు భారతీయులతో పాటు ఎన్నోదేశాలకు చెందిన వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే హెచ్ 1 బీ వీసాల గురించి అగ్ర రాజ్యం ఓ కీలక అప్డేట్ ఇచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వీసాల కోసం కొన్ని దరఖాస్తులు వచ్చినట్లు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం తెలిపింది. హెచ్-1బీ పొందని పిటిషనర్లకు మరికొన్ని రోజుల్లో ఆన్‌లైన్‌లో సమాచారం ఇస్తామని తెలిపింది. వీటిని పంపడం పూర్తైన తర్వాత.. ఎంపిక కాని వారికి స్టేటస్ మెసేజ్‌ను ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచనున్నట్లు వివరించింది..‘‘2025 ఆర్ధిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా పిటిషన్ దాఖలు ప్రక్రియ జూన్ 30, 2024తోనే అయిపోయింది. అయితే, 30వ తేదీ ఆదివారం కావడంతో జులై 1న దాఖలైన పిటిషన్లను కూడా గడువులోగా చేసినట్లుగానే పరిగణిస్తాం.. కానీ, వీసా పరిమితి నుంచి మినహాయింపు కలిగిన పిటిషన్ల స్వీకరణ, పరిశీలన కొనసాగుతుందని వివరించింది. Also Read: ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు.. ఈవెంట్స్‌లో 44 మంది క్వాలిఫై ముఖ్యంగా హెచ్-1బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న నిపుణుల ఉద్యోగ నిబంధనలు, సంస్థ మార్పు వంటి ఇతర కారణాలతో దాఖలు చేసే పిటిషన్ల స్వీకరణ జరుగుతుంది’’ అని యూఎస్‌సీఐసీ వివరించింది. మార్చి 6న హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమై... దానిని మార్చి 25 వరకు కొనసాగుతుందని యూఎస్‌సీఐఎస్ ఈ ఏడాది ఆరంభంలో తెలిపింది. Also Read: ఆ రెండు ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలు: భట్టి విక్రమార్క తర్వాత దానిని మళ్లీ పొడిగించింది. ‘‘ప్రస్తుత H-1B వీసా ఉద్యోగి అమెరికాలో ఉండగలిగే సమయాన్ని పొడిగింపునకు దాఖలు చేసిన పిటిషన్‌లను మేము అంగీకరించి, ప్రాసెస్ చేయడం కొనసాగిస్తాం’’ అని వివరించింది. అంతర్జాతీయ, విదేశీ వృత్తి నిపుణుల సేవలను వినియోగించుకోవాలని భావించే అమెరికా కంపెనీలు తాత్కాలికంగా వీసాలను జారీ చేస్తుంటాయి. ఇందుకోసం ఏటా 85 వేల హెచ్-1బీ వీసాలను అమెరికా జారీ చేస్తుంటుంది. ట్రంప్ రాకతో.. Also Read: డిసెంబర్ 7,8,9 తేదీల్లో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు: సీఎస్ ఇందులో 65 వేలు రెగ్యులర్ క్యాప్ కింద కాగా.. మరో 20 వేల వీసాలను తమ దేశంలో అడ్వాన్స్ డిగ్రీలు చేసిన వారికి మాత్రమే ఇస్తున్నట్లు సమాచారం.హెచ్-1బీ వీసాలు ఎక్కువగా పొందుతున్నవారిలో భారతీయులే ఉండడం విశేషం. అయితే, గూగుల్, ఇన్ఫోసిస్, అమెజాన్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థలు 2023 అక్టోబరు 1 నుంచి 2024 సెప్టెంబరు 30 మధ్య ఈ వీసాలను ఇటీవల తగ్గించుకుంటున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. Also Read: Movies: వైభవంగా చైతూ–శోభిత పెళ్లి..మురిసిపోయిన నాగార్జున 2023 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం 3,86,000 వీసాలను జారీచేయగా... ఇందులో భారతీయులే 72.3 శాతం ఉండడం విశేషం. ఆ తర్వాత 11.7 శాతంతో చైనీయులు రెండో స్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది.ట్రంప్ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నిక కావడంతో వీసా నిబంధనల్లో మరింత కఠినతరం అవుతాయని తెలుస్తుంది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి